Thursday, October 29, 2009
కొండా సురేఖకి అంత ఇబ్బందిగా ఉంటే. . .
అయితే . . . ఆమె కరెక్ట్ గా ఇప్పుడు రిజైన్ చేయడం వెనక ఉన్నా ఆంతర్యం ఏమిటి?
ప్రజలు అందరూ కలిసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే. . . వాళ్లు తమ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్ట్టి, నా మనసు బాధ పడింది కాబట్టి నేను రిజైన్ చేశాను అంటే అదే ఒక ప్రజా ప్రతినిధిగా ఎంతవరకు సమంజసం?
అంటే వీళ్ళకి స్వప్రయోజనాలే తప్ప . . . ప్రజల సమస్యలు కానీ, ప్రజల బాగోగులు కానీ పట్టవా?
ఇప్పటి రాజకీయ నాయకులని చూస్తుంటే. . . డబ్బులు సంపాదించాలంటే రాజకీయాలు ఒక మంచి టూల్ అని చెప్పే విధంగా ఉన్నాయి .. .
ఎందుకొచ్చిన రాజకీయాలు. . .
టాటా బిర్లా లాగానో, అంబాని సోదరుల్లానో వ్యాపారాలు చేసుకుని జనాల్ని దోచుకోక. .
ప్రజల కోసం అంటూ వచ్చి, ప్రజల సేన్సిటివిటి తో ఆడుకోవడం ఎందుకు?
నాయకుల సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ప్రజల మనోభావాలతో ఆటలాడితే మీ పునాదులు కదులుతాయి జాగ్రత్త. . .
Wednesday, October 28, 2009
తెలంగాణా తెరపైకి
అసలు కెసిఆర్ కి తెలంగాణా రావడం కోసం ఏమైనా మనస్పూర్తిగా చేయాలనీ ఉందా. . . లేకపోతె రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు ఇదొక ఇష్యూ ఉంది కదా అని అలా తెరపైకి వస్తుంటారా ?
Monday, October 5, 2009
చాలా రోజుల తరువాత
టైపు చేయాలంటే చాలానే ఉంది. . . కానీ
దానితో పాటు కాస్తంత గందర గోళం కూడా ఉంది. .
అందుకే చిన్నగా ఆలోచనలను పక్క దారి పట్టకుండా. . . జాగ్రత్తగా ఒక దారిలో పెట్టి. . .ఆ తరువాత కీబోర్డు కి పని చెప్తాను
అంతవరకు
అందరికీ హాయ్
బై
Wednesday, June 17, 2009
చానల్స్ కి కూడా ఎ సర్టిఫికేట్ ?!
చానల్స్ కి కూడా ఎ సర్టిఫికేట్ ?!
న్యూస్ చానెల్స్ లో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ కి . . . అలాగే ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ లో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ కి ఎ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది.క్రైమ్ ఆధారిత కార్యక్రమాలు , ఎంటర్ టైన్ మెంట్ పేరుతొ వచ్చే కొన్ని కార్యక్రమాలు బూతు సినిమాల కంటే ఘోరంగా ఉంటున్నాయి.
ఇటువంటి కార్యక్రమాలకి ఎ సర్టిఫికేట్ ఇచ్చి వాటిని ప్రసారం చేసే సమయాలను కూడా కాస్త చూసి కేటాయించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.
ఇప్పుడొచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెద్దలే చూడలేకపోతున్నారు .
చచ్చేంత బూతు కంపు కొడుతున్న కార్యక్రమాలను ఆపేనాథుడు లేడా. . .
హో దేవుడా .
Wednesday, June 3, 2009
మొదలైంది అసెంబ్లీ బ్లా బ్లా
మొదలై రెండు రోజులు కాలేదు. . అప్పుడే అధికార పక్షం, విపక్షాల గోల మొదలయింది .
ఇక ముందు ముందు వీళ్ళు ప్రజల సమస్యల గురించి ఏమి మాట్లాడతారు? అయినట్టే . . . ప్రజల పెళ్లి
Saturday, May 30, 2009
ఎంతో ఉంది. . .
ఆ తరువాత గాని తెలుసుకోరు. . . విషయం ఎంతో ఉందని.
అందుకే ఏ విషయాన్నీ అయినా తేలికగా తీసుకోకండి. . .
Tuesday, May 19, 2009
emainaa maarpu vachhinda?
రొజూ వారి దినచర్యలో . . .
మీ పనిలో . . . .
మీ మనసులో. . . .
మీ మాటలో. . .
ఏమైనా మార్పు వచ్చిందా?
Wednesday, May 13, 2009
బాబొయ్ మాక్స్ లు
ప్రసాద్, పి వి ఆర్ లలో సినిమాలు చూసినప్పుడు . . . (మొదటి రోజుల్లో . . .) హాల్లోపలికి తీసుకేల్లతప్పుడు రాజ మర్యాదలతో తీలుకేల్లి. . . పంపేటప్పుడు మాత్రం మీతో మాకు ఏ మాత్రం సంభందం లేదు అన్నట్టు పంపేవారు . . .
ఆ తరువాత ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబోలు. . . కాస్త మార్చారు .
నిన్న ఐనాక్స కి వెళ్ళాను . . . అక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుండి కంఫ్యూజన్ మొదలైంది. . .
మొదట పార్కింగ్ . . . . మూడో నాలుగో లెవెల్స్ ఉన్నాయి . . . ఒకే పార్కింగ్ కి ఆ మాత్రం ఉంటే హాయిగా ఉంటుందిలే అనుకున్నాం . . . ఒక మూడు లెవెల్స్ లోపలికి వెళ్ళిన తరువాత పార్కింగ్ చేసాము. . . సినిమా కి ఎలా వెళ్ళాలి అని అడిగితె లిఫ్ట్ ఎక్కి . . . . పై ఫ్లోర్ కి వెళ్ళండి. . . అక్కడినుండి ఎక్స్ లే టార్లు ఉంటాయి అని అక్కడ ఉన్నా ఒక ఉద్యోగి చెప్పారు. . . సరే అని లిఫ్ట్ ఎక్కాము. . . వాళ్లు చెప్పినట్టే కింద నుండి పైకి వచ్చి సినిమా హాల్లోకి ఎలా వెల్లాల అని అటు ఇటో చూసి వెతుక్కుంటూ ఎక్స్ లే టార్ వద్దకు వెళ్ళాము. . . అలా వెళ్తూనే ఉన్నాము వెళ్తూనే ఉన్నాము . . .
ఒక పది నిముషాలు వెళ్ళిన తరువాత . . . సినిమా ఉన్నా ఫ్లోర్ వచ్చింది. . .
తీరా లోపలికి వెళ్ళిన తరువాత కూడా గందరగోలమే ఎందుకంటే. . . వుడెన్ డోర్ లాంటిది ఉంది . . .అది లాక్కుని వెళ్తే. . . లోపలికి వెళ్ళాక అంటా చీకటిమయం . . . అక్కడ ఇంకో డోర్ ఉంది. . . అది తెలియక మాతో సినిమా కి వచ్చిన ఒకరైతే వేరే పక్కకి వెళ్లి గోడకి కొట్టుకున్నారు కూడా. . .
అలా కష్టపడి వెళ్లి కూర్చుందామని చూస్తె అక్కడా నిరాశే ఎదురైంది . . . కరెక్ట్ గ స్క్రీన్ ముందు రెండో వరసలో సీట్లు. . .
పోనీలే ప్రసాద్ లో లాగ స్క్రీన్ కి కాస్త దూరం లో ఉందా అద్జుస్త్ అవ్వొచ్చు అనుకుంటే అదీ కాదు . . . వేరే దారి లేక కూర్చున్నాం . . . ఎందుకంటే డబ్బులు పెట్టాం కదా. హై గా పి చేసి . . . ఇది వరకు రోజుల్లో రూపాయిన్నర టికెట్ లో కూర్చునట్టు కూర్చుని సినిమా చూసాం . . . దేవుడి దయ వల్ల ఆ సినిమా మరీ విసిన్గించేల లేదు కాబట్టి సరిపోయింది లేదంటే. . . మా బాధలు కొని తెచుఉకున్న కషతలే అయ్యేవి. . .
ఓకే
సినిమా బాగానే చూసి. . . బయటకి వచ్చాము . . . కాస్త మెడనొప్పి తో . . .
పార్కింగ్ దగ్గరికి వెళ్లి . . . బండి తీసేటప్పుడు. . . మాక్స్ కదా మహా ఉంటే పదిహీను రూపాయిలు ఉంటుందేమో లే అనుకున్నాము పార్కింగ్ ఫీజు . . .
అబ్బే ఎంతైనా మాక్స్ కదా ఇరవై ఐదు రూపాయిలు ఒక్కో బండికి అని చెప్పాడు. . . ఇంకేమి మాట్లాడలేని పరిస్తుతల్లో . . . బ్యాగ్ లో ఉన్నా వంద నోట్ తీసి ఇచ్చి ఊరుకున్నాం. . . చేంజ్ విషయం లో కూడా వాళ్ళు మాక్స్ గానే మమ్మల్ని బురిడీ కొట్టించారు. . .
యాభై తో పాటు . . . మరో పది రూపాయిలు చిల్లర ఇవ్వకుండా పంపించేసారు. . .
అప్పటికే విసిగి పోయి ఉన్నా మేము . . . సిస్టం ముందు కూర్చుని ఇచ్చారు కదా చిల్లర కర్రెక్ట్గానే ఇస్తారు అనుకున్నాం . కాని నమ్మకం కాస్త హుష్ కాకి అని ఎగిరిపోయింది . . . అందుకు పది రూపాయల చిల్లు పడింది మాకు.
ఇదంతా చూసిన తరువాత నాకు ఒకటి అనిపించింది. . .
మాక్స్ ల కి వెళ్ళే వాళ్ళకి కాస్త శిక్షణ అవసరం అని. . .
ఈ ఎండాకాలంలో నాకు తగిలిన మహా ఎండ దెబ్బ ఇదే. . .
Monday, May 11, 2009
మండే ఎండలు
అందుకు తగ్గట్టుగానే ఉంది ఎండల వేడి కూడా. . .
రోజు రోజు కి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే . . . . దడ పుడుతోంది. . .
రోడ్ మీద వెళ్తున్నప్పుడు దారిలో చెట్లు ఉన్నప్పుడు ఎంత వేడిగా ఉన్నప్పటికీ కాస్త చల్లగానే అనిపిస్తుంది . . .
అందుకే . . . మనిషికి ఒక మొక్క పెంచితే . . . . వాతావరణాన్ని , దానితో పాటు మనల్ని రక్షించుకున్న వాళ్ళము అవుతాము . . .
Tuesday, May 5, 2009
Monday, May 4, 2009
O&M creates ‘ZooZoos’ for Vodafone
O&M creates ‘ZooZoos’ for Vodafone
Payal Khandelwal, 27 April, 2009

Mumbai
After the famous pug, O&M has now created a new set of characters called ‘ZooZoos’ for the latest Vodafone campaign featuring value added services. The spots were launched during the ongoing IPL series.
The agency was tasked to leverage the IPL 2 to communicate the wide range of products and services from Vodafone while building a consistent brand story.
Explaining the idea behind the campaign, Rajiv Rao, executive creative director, O&M says, “We created a special world in which all the product stories get told. A world which is real yet different, strange yet simple, warm and lovable. All the specific product stories and services get told in this world of Zoozoos, making the messages more charming.”One of the most interesting facts about this campaign is that even though the ZooZoo characters look animated, they have been played by real people dressed in a white attire. Reveals director Prakash Varma of Nirvana films, “Animation requires so much detailing and here we had to do the exact opposite. We had to make real characters look like animated characters. It was quite challenging as none of them could see as they were covered from head to feet. The set, including all the props, is in the form of shadows created by spray painting.”
The media mix for the campaign includes television, print, outdoor, radio activation and online. There is a ZooZoo community on Facebook which has around 3183 fans and which features all the ZooZoo commercials that have been released so far, ZooZoo emoticons and ‘Tag me’ application.
తెలియదు
మనసంతా దిగులుగా . . .
కళ్ళ నిండా నీళ్ళతో
ఎవరైనా కదిలిస్తే చాలు కుండపోతగ కన్నీరు కురిసేలా?
ఎందుకు?
ఎందుకో తెలియదు. . .
ఇదీ అని చెప్పలేని బాధ, కోపం, . . .
కోపం. . .
ఎవరి meeda? ఏమో అది కూడా తెలియదు. . .
బాధ?
ఎందుకో తెలియదు. . .
తెలియదు. . . తెలియదు. . . తెలియదు. . .
నిస్సహాయత. . .
నిజం చెప్తే అందరూ అబధం cheptaru kabatti
నేను చెప్పిన నిజం కూడా అబద్ధం అని ఎదుటి వాళ్ళు అన్నప్పుడు. . .
అనుమానంగా చూస్తుంటే. . . బాధ. . .
మనసంతా ఎవరో గడ్డపార పెట్టి పెళ్ళగించి వేస్తున్న ఫీలింగ్. . .
ఎవరితో నైన చెప్తే . . .
నిజం ఎందుకు చెప్పావు అంటూ హేళన చేస్తారేమొ ననే. . . బెంగ
నిజంగా నిజం ఎందుకు చెప్పకూడదు అని నన్ను నేనే బేలగా వేసుకున్న ప్రశ్నకు సమాధానం తెలియక. . .
బాధ. . .
నిజంగానే ఎందుకో తెలియదు.
తెలియదు
తెలియదు
Friday, May 1, 2009
nirantara poratam
బ్రషింగ్ మొదలుకుని . . . . క్యారియర్ లో లంచ్ సిద్దం చేసుకునే వరకు. . .
ఆ తరువాత ఆఫీసు కి వెళ్లేందుకు పోరాటమే . . . రోడ్ మీద . . .
ట్రాఫిక్ లో. . . జర్నీ . . . ఎండా , , , , వేడి . . .
రేడియేషన్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎంతలా మారిపోయిందో . ..
మొన్నీ మధ్య ఒక న్యూస్ కూడా చదివాను . . .
సెల్ టవర్ రేడియేషన్ వల్ల ఒకావిడకి కాన్సర్ వచ్చి మరణించింది అని . . .
అందుకే సెల్ టవర్స్ నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను . . .
కనీసం జనావాసాల్లో వీటిని నిర్మించకుండా ఉంటే చాలు. . . అనిపిస్తుంది .
సెల్ టవర్ రేడియేషన్ గురించి, వీటి వల్ల జరిగే చెడు గురించి ప్రజలకి తెలియచేద్దాం అనుకుంటున్నాను. . .
ఉద్యమంలో పాలు పంచుకోవాలని అనుకుంటే . . . నాకు మెసేజ్ పెట్టండి. మనం అందరం కలిసి కొంతమేరకైనా రేడియేషన్ ప్రభావాన్ని ప్రకృతి మీద పడకుండా చూసుకోవచ్చు. . .
Tuesday, April 28, 2009
ఎలాగైతేనేమి సంతోషించడమే కావాల్సింది
ఎందుకు చేయాలి?
తప్పదా. . .
జీవితం
ఇష్టం లేని విషయం కష్టమైనా చేయాలి . . .
తప్పదు మరి
ఏమి చేద్దాం
ఇష్టం లేకపోయినా తప్పదు మరి
చేయక తప్పదు
* * * *
ఇష్టం ఉన్నపని చేయాలంటే?!
ఎన్నో అడ్డంకులు
ఆ అడ్డంకులన్నీ దాటి . . .
తమ మనసుకు నచ్చిన పనులు చేసే వారిని చూస్తె
ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది . . .
అప్పుడప్పుడు కాస్త కుళ్ళుగా కూడా అనిపిస్తుంది . . .
వాళ్ళనుకున్న పనులు వాళ్ళు చేస్తున్నందుకు
పోనీలే కనీసం వాళ్లైనా వాళ్ల మనసులని తృప్తి పరుచుకుంటున్నారు అన్నా ఆలోచన ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కూడా. . .
ఎలాగైతేనేమి . . .
ఆరోగ్య వంతమైన జీవితానికి కావాల్సింది సంతోషమే కదా.
Monday, April 27, 2009
ఇంతకీ గెలుపెవరిది?
లేకపోతె
వోటర్ మహాసయుడ్ని చాలా తెలివిగా మోసం చేశామని చెప్పుకుని. . .
మీసాన్ని గర్వంగా మేలివేసే నాయకులదా? ఇంతకీ గెలుపెవరిది ?
Monday, April 20, 2009
radio mirchina? leka radio pichhi...na?!
ఎఫ్.ఎం. రేడియోలు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాయి . . . అంత వరకు ఓకే.
అయితే ఆ ఎంటర్ టైన్ మెంట్ కాస్త పైత్యంగా ఉండకూడదు కదా.
ఈ ఎఫ్ ఎం వాళ్లు ప్రసారం చేస్తున్న ఒక ప్రోగ్రాం లో బేబి - మమ్మీ అంటూ ఒక కార్యక్రమం వస్తుంది. . . అందులో పైత్యం విపరీతంగా వినిపిస్తుంది . . .
హీరోయిన్ అంటే . . . బుర్ర లేకుండా , డ్రెస్ లు కోసమో, తిండి కోసమో, ఇంక దేని కోసమోనో పనిచేస్తుందని. . ఇక తల్లి పాత్రను కూడా అలానే చిత్రీకరించి మరీ చూపిస్తున్నారు. . . సారీ వినిపిస్తున్నారు. . .
ఈ ప్రోగ్రాం చాలా అసహ్యం గా ఉంది. . .
Sunday, April 19, 2009
పాలిటిక్స్ ఏమవుతున్నాయి
ప్రాంతీయ విద్వేషాలను వీరి స్వార్ధ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారు . . .
సామాన్య జనం గురించి వీరు సామాన్యంగా ఒక్క సెకండ్ ఆలోచించ గలిగితే . .. . ఎంత బాగుంటుందో కదా?
అప్పుడు మాటలు వస్తున్నా చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉంటారు.
జనం గురించి ఆలోచించరూ.
Wednesday, April 15, 2009
స్పందనలు
ఈ అంశాన్ని కొందరు కామెడీ గా తీసుకుంటే . . . మరి కొందరు సీరియస్ గా తీసుకున్నారు . . .
ముఖ్యంగా పద్మక్క దగ్గరో, వోల్గా దగ్గరో ట్రైనింగ్ అయ్యారా అని ఒకరు అడిగారు . . . వారికి చెప్పేది ఏమిటంటే . . . ఇది మీరనుకున్నట్టు ఫేమినిస్తిక్ థింకింగ్ కాదు . . . జేనేరలిస్టిక్ థింకింగ్ మాత్రమె . . . మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి హ్యూమనిజం ఉన్న దగ్గర ఫెమినిజం . . . ఇంకో ఏ ఇజమో ఉండాల్సిన అవసరం లేదు. . .
మీరు ఒక విషయం గమనించారో లేదో కానీ . . .
వంద శాతం మగవాళ్ళు గ్రేట్ అని చెప్పలేదు నేను . . . కొందర్ని మినహాయించాను. గమనించండి . . .
మరో అంశం ఏమిటంటే. . . ఇది నేను సీరియస్ గానే రాసాను . . . కామెడీ కోసం రాయలేదు . . .
ఈ అంశానికి ఇందరు స్పందిచినందుకు చాలా ధన్యవాదాలు . . .
మరి కొన్ని స్పందనలు వస్తాయని ఆశిస్తున్నాను.
Sunday, April 12, 2009
ఎంతైనా మగవాళ్ళే గ్రేట్
ఎందుకంటే పొద్దున్నే లేచిన దగ్గరి నుంచి . . . .
ఇంట్లో అందరి అవసరాలు తీర్చేందుకు పరుగులు పెట్టక్కర్లేదు
ఎందుకంటే అంట్లు తోమక్కర్లేదు
ఎందుకంటే బట్టలు ఉతకక్కర్లేదు
ఎందుకంటే పచారి సామాను లెక్కలతో పనిలేదు
ఎందుకంటే వంటింటి తో అస్సలు సంబంధమే లేదు
ఎందుకంటే వంట చేయాల్సిన అవసరం. . .
అలాగే టీ, టిఫిన్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేనే లేదు
అందుకే . . . ఎంతైనా మగవాళ్ళు గ్రేట్
..........................
ఎందుకంటే పిల్లల చదువుల గురించి. . . .,
ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదు.
ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి. . .
వాళ్ల గురించి కూడా అప్పుడప్పుడే తప్ప, ఎప్పుడూ పట్టించుకోనక్కర్లేదు.
అంతెందుకు ఏ బిల్లూ కట్టక్కరలేదు. . .
అయిన మగవాళ్ళే గ్రేట్. . . .
. . . . . .. . .
అది కూడా తల్లో. . ., పెళ్ళామో. . .
వేడి వేడిగా బ్రేక్ ఫాస్ట్. . ., లంచ్ బాక్స్ కట్టిస్తే . . .
దాన్ని భద్రంగా పట్టుకెళ్ళి ఏసి రూముల్లో (దాదాపు ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో ఎసి లు ఉంటున్నాయి కాబట్టి)
చెమటోడ్చి పని చేసి . . . తినాలి కదా
ఎంతోకష్టం . . .
అందుకే మగవాళ్ళే గ్రేట్ . . .
..........................................
జనం మెచ్చే పని మాత్రమే చేస్తూ. . .
వాహ్వా అనిపించుకుంటారు కాబట్టి
మగ వాళ్ళే గ్రేట్. .
మగ మహారాజుకి జీతం కూడా తగ్గదు
అందుకే వాళ్ళే గ్రేట్
.........................................
వాళ్లు గ్రేట్ కాదని మీరు అన్నారో . . .
మీరు తెలివిలేని వారు
ఆ పై బతకడం కూడా బహు కష్టం . . .
హుష్ జాగ్రత్త
Saturday, March 28, 2009
ముసుగు మనసుకు కాదు
ఇదే డౌట్ ను వ్యక్తం చేసారు నా కొలీగ్ ఒకరు .
ఆ అరెంజేమంట్ఎందుకో చెప్పిన తరువాత. . . ఆ అరణ్జేమేంట్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో వివరించిన తరువాత. . . అయ్యో ఆ వేషం వెనుక అంత విషయం ఉందా అని ఆస్చార్యాన్ని వ్యక్తం చేసారు.
అందుకే మహానుభావులారా . . . ముసుగు ఎన్నో ఎలిమెంట్స్ నుండి రక్షించుకోవడానికి ముఖానికే కానీ మనసుకి కాదు అని అర్ధం చేసుకోండి.
సరేనా
Thursday, March 26, 2009
ennikalu . . . cinemalu. . . TV channels
ఎన్నికలు, సినిమాలు ఏకమై పోయినట్టు అనిపిస్తోంది. ఇదివరకు కనీసం ఎంటర్ టైన్మెంట్ సినిమాల్లో కనిపిస్తుంది.. .
కనీసం ఎటువంటి కాస్ట్ ఫీలింగ్ లేకుండా సినిమా వాళ్ళను ఇష్టపడేవాళ్ళు జననాలు. అది ఇది వరకు సంగతి. . .
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు . . . పాలిటిక్స్ నుండి కుల రాజకీయాలు సినిమాలకు చేరాయి. .
సారీ చేరాయి అనేకంటే . . . బాగా అంటాయి అంటే బాగుంటుందేమో. . .
అదేంటో ఎక్కడా క్లారిటీ కనిపించడం లేదు. . .
ప్రజలకి, వార్తలకి వారధిగా నిలిచే మీడియా లో కూడా. . . ఒక్కోకరిది ఒక్కో పార్టీ, ఒక్కో వర్గం. . .
ఇదే కారణమో లేకపోతె, పొలిటికల్ డ్రామా లో సీన్ సేక్యూన్స్ బ్రేఅక్ అవుతుందో తెలియదు కాని. . .
ఎవరికీ క్లారిటీ లేదనే విషయం అయితే అర్ధం అవుతోంది . . .
అంతెందుకు ఆ కన్ఫూసన్ మామూలు మనుషుల్లో కూడా నిండింది . . .
అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే..... నేనే..... నేనే .... ఎందుకంటే నేను ఒకటి రాద్దామని మొదలు పెట్టి మరొకటి ఏదో రాసాను.
అంత కంఫ్యూజన్ వచ్చేసింది . . .
కాంగ్రెస్, టి డి పి, టి ఆర్ ఎస్, సి పి ఎం, సి పి ఐ, ఎం టి పి పి పి , . . . . అయ్యా బాబొయ్ చెప్పుకుంటూ పొతే కాలనీకో పార్టీ ఏర్పదేట్టు ఉంది. . .
ఏడ్చినట్టే ఉంది రాజకీయాల గోల.
అంటే ఏడ్చినట్టు ఉంది సినిమా వాళ్ల జంప్ జిలానీ వ్యవహారం . . .
ఇంకా. . . చెప్పడానికే వీలు కాని విధంగా, ఏదోలా ఉంది మీడియా వ్యవహారం. .
ఒక పక్క ఆర్ధిక మాంద్యం , మరో పక్క రాజకీయాల గోల
ఇన్ని గోలల మధ్య సామాన్య మానవుడు ఏమవుతాడో . . .????????????????????
కొన్ని మిలియన్ కోట్ల ప్రశ్న?
అందరూ ప్రజలకి ఏదో చేసేస్తామని చెప్తున్నారు కానీ ఏమి చేసారు ఇంతవరకు ఇక ముందు ఏమి చేస్తారు అనేది మాత్రం చాలా అర్ధం కాని విషయం . . .
Sunday, March 1, 2009
Wednesday, January 28, 2009
సాఫ్టువేర్ ఒక్కటే లోకం కాదు కదా . . .
మామూలు జనాలు కూడా ఉన్నారండి పత్రికా జర్నలిస్టు లు . . . కాస్త చూడండీ?
Tuesday, January 27, 2009
Monday, January 26, 2009
గుబ్బకాయ

ఇవి చాలా ఖరీదు గురూ. . .
వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం