Wednesday, May 13, 2009

బాబొయ్ మాక్స్ లు

అయ్యబాబోయ్ అనిపించాయి మాక్స్ సినిమా హల్ల్స్ ను చూస్తుంటే. . .
ప్రసాద్, పి వి ఆర్ లలో సినిమాలు చూసినప్పుడు . . . (మొదటి రోజుల్లో . . .) హాల్లోపలికి తీసుకేల్లతప్పుడు రాజ మర్యాదలతో తీలుకేల్లి. . . పంపేటప్పుడు మాత్రం మీతో మాకు ఏ మాత్రం సంభందం లేదు అన్నట్టు పంపేవారు . . .
ఆ తరువాత ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబోలు. . . కాస్త మార్చారు .

నిన్న ఐనాక్స కి వెళ్ళాను . . . అక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుండి కంఫ్యూజన్ మొదలైంది. . .
మొదట పార్కింగ్ . . . . మూడో నాలుగో లెవెల్స్ ఉన్నాయి . . . ఒకే పార్కింగ్ కి ఆ మాత్రం ఉంటే హాయిగా ఉంటుందిలే అనుకున్నాం . . . ఒక మూడు లెవెల్స్ లోపలికి వెళ్ళిన తరువాత పార్కింగ్ చేసాము. . . సినిమా కి ఎలా వెళ్ళాలి అని అడిగితె లిఫ్ట్ ఎక్కి . . . . పై ఫ్లోర్ కి వెళ్ళండి. . . అక్కడినుండి ఎక్స్ లే టార్లు ఉంటాయి అని అక్కడ ఉన్నా ఒక ఉద్యోగి చెప్పారు. . . సరే అని లిఫ్ట్ ఎక్కాము. . . వాళ్లు చెప్పినట్టే కింద నుండి పైకి వచ్చి సినిమా హాల్లోకి ఎలా వెల్లాల అని అటు ఇటో చూసి వెతుక్కుంటూ ఎక్స్ లే టార్ వద్దకు వెళ్ళాము. . . అలా వెళ్తూనే ఉన్నాము వెళ్తూనే ఉన్నాము . . .
ఒక పది నిముషాలు వెళ్ళిన తరువాత . . . సినిమా ఉన్నా ఫ్లోర్ వచ్చింది. . .
తీరా లోపలికి వెళ్ళిన తరువాత కూడా గందరగోలమే ఎందుకంటే. . . వుడెన్ డోర్ లాంటిది ఉంది . . .అది లాక్కుని వెళ్తే. . . లోపలికి వెళ్ళాక అంటా చీకటిమయం . . . అక్కడ ఇంకో డోర్ ఉంది. . . అది తెలియక మాతో సినిమా కి వచ్చిన ఒకరైతే వేరే పక్కకి వెళ్లి గోడకి కొట్టుకున్నారు కూడా. . .
అలా కష్టపడి వెళ్లి కూర్చుందామని చూస్తె అక్కడా నిరాశే ఎదురైంది . . . కరెక్ట్ గ స్క్రీన్ ముందు రెండో వరసలో సీట్లు. . .
పోనీలే ప్రసాద్ లో లాగ స్క్రీన్ కి కాస్త దూరం లో ఉందా అద్జుస్త్ అవ్వొచ్చు అనుకుంటే అదీ కాదు . . . వేరే దారి లేక కూర్చున్నాం . . . ఎందుకంటే డబ్బులు పెట్టాం కదా. హై గా పి చేసి . . . ఇది వరకు రోజుల్లో రూపాయిన్నర టికెట్ లో కూర్చునట్టు కూర్చుని సినిమా చూసాం . . . దేవుడి దయ వల్ల ఆ సినిమా మరీ విసిన్గించేల లేదు కాబట్టి సరిపోయింది లేదంటే. . . మా బాధలు కొని తెచుఉకున్న కషతలే అయ్యేవి. . .
ఓకే
సినిమా బాగానే చూసి. . . బయటకి వచ్చాము . . . కాస్త మెడనొప్పి తో . . .
పార్కింగ్ దగ్గరికి వెళ్లి . . . బండి తీసేటప్పుడు. . . మాక్స్ కదా మహా ఉంటే పదిహీను రూపాయిలు ఉంటుందేమో లే అనుకున్నాము పార్కింగ్ ఫీజు . . .
అబ్బే ఎంతైనా మాక్స్ కదా ఇరవై ఐదు రూపాయిలు ఒక్కో బండికి అని చెప్పాడు. . . ఇంకేమి మాట్లాడలేని పరిస్తుతల్లో . . . బ్యాగ్ లో ఉన్నా వంద నోట్ తీసి ఇచ్చి ఊరుకున్నాం. . . చేంజ్ విషయం లో కూడా వాళ్ళు మాక్స్ గానే మమ్మల్ని బురిడీ కొట్టించారు. . .
యాభై తో పాటు . . . మరో పది రూపాయిలు చిల్లర ఇవ్వకుండా పంపించేసారు. . .
అప్పటికే విసిగి పోయి ఉన్నా మేము . . . సిస్టం ముందు కూర్చుని ఇచ్చారు కదా చిల్లర కర్రెక్ట్గానే ఇస్తారు అనుకున్నాం . కాని నమ్మకం కాస్త హుష్ కాకి అని ఎగిరిపోయింది . . . అందుకు పది రూపాయల చిల్లు పడింది మాకు.
ఇదంతా చూసిన తరువాత నాకు ఒకటి అనిపించింది. . .
మాక్స్ ల కి వెళ్ళే వాళ్ళకి కాస్త శిక్షణ అవసరం అని. . .
ఈ ఎండాకాలంలో నాకు తగిలిన మహా ఎండ దెబ్బ ఇదే. . .

Monday, May 11, 2009

మండే ఎండలు

పొలిటికల్ నాయకులకి మనస్సులో ఎంత వేడిగా ఉందొ. . . . .
అందుకు తగ్గట్టుగానే ఉంది ఎండల వేడి కూడా. . .
రోజు రోజు కి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే . . . . దడ పుడుతోంది. . .
రోడ్ మీద వెళ్తున్నప్పుడు దారిలో చెట్లు ఉన్నప్పుడు ఎంత వేడిగా ఉన్నప్పటికీ కాస్త చల్లగానే అనిపిస్తుంది . . .
అందుకే . . . మనిషికి ఒక మొక్క పెంచితే . . . . వాతావరణాన్ని , దానితో పాటు మనల్ని రక్షించుకున్న వాళ్ళము అవుతాము . . .

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం