Friday, May 28, 2010

సురేఖ కి నిద్ర మాత్రలు ఎక్కడివి?

సురేఖ గారు మీ డ్రామా గ్రాండ్ సక్సెస్ అయ్యింది . మీకు అంత గొడవలో నిద్ర మాత్రలు ఎక్కడి నుండి వచ్చాయి?
అంటే ముందు గానే ప్లాన్ చేసి పెట్టుకున్నారా?
మీకు ముందే ఇంత గొడవ జరుగుతుందని తెలుసన్నమాట. అందుకే డ్రామా ని రక్తి కట్టించడానికి బాగా ప్రిపరే అయ్యి వచ్చారు.
వెరీ గుడ్.
ఒక ప్రజా నేత అయ్యి ఉండి అన్ని బూతులు ఓపెన్ గా ఎందుకు తల్లీ తిట్టావు.
ఛీ. . .

జగన్ ని ముందే అరెస్ట్ చేస్తే . . .

జగన్ ని ముందే అరెస్ట్ చేస్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా.
ఒక ప్రాణం గాల్లో కలిసేది కాదు.
కొండా సురేఖ బూతు పురాణం వినాల్సి వచ్చేది కాదు.
మరీ ముఖ్యం గా అన్ని డబ్బులు ఖర్చు అయ్యేవి కాదు కదా
మైండ్ లెస్స్ ఫెల్లోస్ నాయకులైతే ఇలానే ఉంటుంది పరిస్థితి.
రోశయ్య మరీ ఇంత లేట్ అయితే ఎలాగయ్యా.
వయసు శరీరానికే కాని మనసుకి ఉండ కూడదు. బాబోయ్.
మీకు చేతకాకపోతే దిగిపోండి. మాకు ఎందుకు ఈ దరిద్రం? మిమ్మల్ని ఎలాగూ మేము ఎన్నుకోలేదు కదా.
హై కమాండ్ ఎంనుకుందని మీరే అన్నారు. అందుకే దిగిపోండి బాబూ.
బాబ్బాబు . . . తొందరగా దిగిపోరు ప్లీజ్

Thursday, May 27, 2010

ఒక పక్క సామాన్యులు బతకలేని స్థితి

రోజు రోజుకి బతకడం కష్టమైపోతుంటే . . .
ఈ రాజకీయనాయకుల గొడవేమిటో అర్ధం కావట్లేదు.
అన్ని పార్టీల నాయకులు అని చెప్పుకునే దొంగ సచ్చినోళ్ళ మీద. . .
తలా ఒక బాంబు వేస్తె సగం దరిద్రం వదులుతుంది.
ప్రజల గోడు పట్టదు కానీ రాజకీయాలు కావాలి. మొత్తంగా స్వార్ధం అనే చీము మాత్రమే వాళ్ళ వంటి నిండా, నిలువెల్లా ప్రవహిస్తోంది.
కడుపుకి ఏమి తింటున్నారో అర్ధం కావట్లేదు.
రాజకీయనాయకులం అని చెప్పుకునే గాడిదలు (సారీ వాటితో కూడా పోల్చకూడదు. అక్కడ ఏమి పదం వాడాలో తెలియక అలా వాడాను. గాడిదలు మీ పేరు వాడినందుకు నన్ను క్షమించండి . ) చేసే ఒక్కో పని ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఆలోచిస్తున్నారా?
ఎంత కోపంగా ఉందంటే. అన్ని భాషల్లో ఉన్న తిట్లు నేర్చుకుని ఒక్కోకదిని నిల్చో పెట్టి తిట్టాలని ఉంది.
వీళ్ళకి సామాన్యుల గురించి పట్టదు.
వాళ్ళు తిరగడానికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు.
పందికొక్కుల్లా బలుస్తున్నారు. వాళ్ళు , వాళ్ళ కుటుంబాలు బాగుంటే చాలు.
పిచ్చి వెధవలు.
వీళ్ళందరి బుర్రలు బాగుపడాలని దేవుడిని కోరుకుంటే. . . ఆ దేవుడే మాయమైపోతాడు వీళ్ళకి భయపడి.
అందుకే రాజకీయ నాయకుడు ఎక్కడుంటే అక్కదట భూమి బద్దలైపోయి వాళ్ళని తనలో కలుపుకుంటే బాగుండు.
అమ్మా భూమాత వాళ్ళని ఎన్నాళ్ళు భరిస్తావు తల్లీ.
కలిపేసుకో నీలో.
అప్పుడే సామాన్యులమైన మేము ప్రశాంతంగా బతకగలం తల్లీ.

Tuesday, May 25, 2010

వేదన

ప్రసవ వేదనని మించిన వేదన మనో వేదన.
ప్రసవ వేదన కొన్ని గంటలే. . .
కానీ మనో వేదన? తీరడానికి మెడిసిన్ లేదు. ఏమి చేసినా అది మనల్ని వదలదు.
ఉంటూనే ఉంటుంది. నేనున్నాను మీకు తోడుగా అంటూ ఎప్పుడూ దానికి మీ మీద చిరాకు పుట్టే వరకు వేదన మీ వెంటే. .
మీకు తోడుగా. ఎంత మంచిదో ఈ వేదన నడిసంద్రంలో వదలదు.
ఎంత మంచిదో ఈ మనో వేదన.
బుర్ర కూడా పనిచేయకుండా ఒకటే ఆలోచనలను విరామం లేకుండా ఉంచుతుంది.
ఎంత మంచిదో ఈ వేదన.
వేదన మిమ్మల్ని వదిలిందా జీవితం అవుతుంది ఓ నివేదన.

Monday, May 24, 2010

మరణం నిశీధి ప్రయాణం

మరణం ఒక నిర్వేదం
మరణం ఒక శాసనం
మరణం ఒక అవసరం
మరణం ఒక ఆవశ్యకం
మరణం ఒక ఓదార్పు
మరణం ఒక చేయూత
మరణం ఒక ధైర్యం
మరణం ఒక సంతోషం
మరణం అదో అద్భుత ప్రపంచం
మరణం అభూతం
మరణం ఒక స్వాంతన
మరణం ఒక విజయం
మరణం ఒక ఆస్వాదం
మరణం అపూర్వమైన విశ్రాంతం
మరణం ఒక విశాల నేత్రం
మరణం ఆత్మకి దొరికే ఆహ్లాదం
అందుకే
మరణం బహుదూరం
అందుకే
మరణం ఒక భయం
అది. అంటే మరణం నిశీధి ప్రయాణం

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం