Thursday, October 29, 2009

కొండా సురేఖకి అంత ఇబ్బందిగా ఉంటే. . .

రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన వెంటనే ఎక్కువగా బాధ పడిన మంత్రులలో కొండా సురేఖ గారే ఉన్నారు. ఇదంతా కూడా ఆమెకు పర్సనల్ గా ఆయనతో ఉన్నా అనుబంధం కావొచ్చు.
అయితే . . . ఆమె కరెక్ట్ గా ఇప్పుడు రిజైన్ చేయడం వెనక ఉన్నా ఆంతర్యం ఏమిటి?
ప్రజలు అందరూ కలిసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే. . . వాళ్లు తమ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్ట్టి, నా మనసు బాధ పడింది కాబట్టి నేను రిజైన్ చేశాను అంటే అదే ఒక ప్రజా ప్రతినిధిగా ఎంతవరకు సమంజసం?
అంటే వీళ్ళకి స్వప్రయోజనాలే తప్ప . . . ప్రజల సమస్యలు కానీ, ప్రజల బాగోగులు కానీ పట్టవా?
ఇప్పటి రాజకీయ నాయకులని చూస్తుంటే. . . డబ్బులు సంపాదించాలంటే రాజకీయాలు ఒక మంచి టూల్ అని చెప్పే విధంగా ఉన్నాయి .. .
ఎందుకొచ్చిన రాజకీయాలు. . .
టాటా బిర్లా లాగానో, అంబాని సోదరుల్లానో వ్యాపారాలు చేసుకుని జనాల్ని దోచుకోక. .
ప్రజల కోసం అంటూ వచ్చి, ప్రజల సేన్సిటివిటి తో ఆడుకోవడం ఎందుకు?
నాయకుల సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ప్రజల మనోభావాలతో ఆటలాడితే మీ పునాదులు కదులుతాయి జాగ్రత్త. . .

8 comments:

Truely said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

meeru chala correctga chepparu.

shiva said...

ilanti nayakula ki kavalasindhi kevelam dabbu anthe , prajala kosam pani chese rojulu yeppudo poyai . Yevaro vasta ru Yedo chestarani manam wait chesthu undalasindhena..?
Athi nichathi nichamaina bathuku anthe ilanthi nayakuladhe ..amaki antha noppiga undha ...jagan CM kakapothe .Asalu CM anthe oorike ivvala ....valla nana pothe property panchi ivvatam la undi CM padaviante ...?
ilantivi chustu undatame ........

శ్రీ said...

బాగా చెప్పారు.కొండా సురేఖ రాజీనామా వార్త చూసి నాకు ఇంచుమించు ఇలాగే కాలింది.లక్షల్లో వోట్లేసే ప్రజలు కాదు వీళ్ళకి ముఖ్యం,ఎవడో ఒకడి తోక పట్టుకుని తిరుగుతూ ఉంటారు పనికిరాని నాయకులు.

Anonymous said...

mee comment baagane undi.. kaani raajeenaama astram venuka aantaryamemito oka journalistga aa maatram artham chesukokapote ela..
aina meeru raasindantaa kuda mee personal kadaa, antagaa paata chintakaaya pachchadi maatalenduku..

Anonymous said...

కొండా సురేఖ తీరు ప్రజల మనోభావాలకు అద్దం పట్టడం లేదనేది మీ స్పష్టమైన అభిప్రాయం లా ఉంది. కానీ నేను ఈ విషయంలో మీతో ఏకీభవించలేక పోతున్నాను. ప్రజలు ఆమెను నియోజక వర్గంలో ఇన్నాళ్ళూ తిరగనివ్వటానికి కారణం ఆమె వై ఎస్ పట్ల వ్యక్తపరచిన అభిప్రాయాలే కారణం. వై ఎస్ ఇచ్చిన మంత్రి పదవిని ఆమె త్యాగం చేశారే తప్ప ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. మంత్రి పదవి ప్రజలు ఇచ్చింది కాదు కాబాట్టి ఆమె ప్రజలకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ఆమె ఎప్పుడూ న్యాయం చేస్తారు. అక్కడి ప్రజలను అడిగితే మేకే తెలుస్తుంది ఆమె ఎంతగా జనం లో కలసి పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారో. ఆమె ఎప్పటికీ జనం మనిషి.

Anonymous said...

కొండా సురేఖ విషయంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయంతో నేను ఏకీభవించలేక పోతున్నాను.ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారే తప్ప ఎమ్మెల్యే పదవికి కాదు. ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. వై ఎస్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం