Thursday, October 20, 2016

పొరుగు చిచ్చు

Sunday, July 10, 2016

ఆకాశానికి హార్మోన్ ప్రాబ్లమ్

టైటిల్  వెరైటీగా ఉందనుకుంటున్నారా...
అవును మనుషులకి వచ్చినట్టే ఆకాశానికి కూడా హార్మోన్ ప్రాబ్లమ్ వచ్చింది మరి..
అబ్బా.... నువ్వేమన్నా ఆకాశానికి డాక్టర్ వా... అంటున్నారా. మీరేమనుకున్నా పర్వాలేదు. కాని... నిజ్జంగానే  ఆకాశానికి హార్మోన్ సమస్య ఉంది. అది మెటియోరాలజిస్టులకు కూడా అంతుపట్టకపోయి ఉండొచ్చు. కానీ నాకు తెలిసిపోయింది...

లేదంటే... మబ్బులు పట్టి ిిిఇపుడో అపుడో భయంకరంగా వర్షం చాచి కొడుతుందని  అనుకునేలోపులోనే... మబ్బులు గాల్లో దూది తేలిపోయినట్టు తేలిపోతున్నాయి. అచ్చం హార్మోన్ సమస్య ఉన్న వాళ్లకి కోపం వచ్చి పోయినట్టే.
అంతెందుకు నీరసం, ఆయాసాలు కూడా అలానే ఉంటాయి కదా. ఈ సమస్య ఉన్న వాళ్లకి ఏ సెకనుకు ఏ మూడ్ ఉంటుందో తెలియనట్టే... ఆకాశం మూడ్ కూడా అర్థం కావడంలేదు. కాసేపు ఎండ... మరి కాసేపు వాన.
అసలింతకీ వాన వస్తుందా... రాదా... అని ఆలోచించే లోపులోనే... ఒక కాలనీలో వాన... మరొక కాలనీలో చెమటా...

అందుకే ఇక లాభం లేదని ఆకాశానికి వచ్చిన  సమస్య గురించి  కూలంకషంగా తెలుసుకోవాలని నేనే డాక్టర్ అవతారం ఎత్తాను. ఆకాశానికి డాక్టర్ గా పనిచేయడం అంటే మాటలు కాదు కదా. విశ్వవ్యాప్తంగా ఉన్న చరాచర జీవరాశులకు గొడుగులా ఉండే పెద్ద దిక్కాయే మరి. ఇంట్లో పెద్ద దిక్కుకి ఏమన్నా అయితే ఇంటిల్లపాది ఎంత గాభరా పడతారు. అందుకే అందరి బాధ్యతా నా భుజస్కందాలపై వేసుకున్నాను.

డాక్టర్ చదువు చదివిన వాళ్లకంటే సిలబస్, ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి మనమేమో అలాంటి చదువు చదవలేదాయే. చదవకపోతేనేం... భూమ్మీద పడినప్పట్నించీ ఆకాశంతో తెలిసీ తెలియని బంధం కొనసాగుతూనే ఉండే... అంతకన్నా గొప్పగా ఏం చదువుతాం... పూర్తిగా  తెలుసుకునేంత కాకపోయినా ఎంతోకొంత నాలెడ్జి అయితే బుర్రకి బాగానే ఉందనిపించింది. అలా అనిపించడం ఆలస్యం ఆకాశానికి డాక్టర్ గా నన్ను నీనే నియమించుకున్నాను. ఆ వెంటనే ఆరు బయటికొచ్చి సీరియస్ గా  ఆశానికేసి  చూశాను.
 నేను నీ డాక్టర్ని వచ్చేశాను ... ఇక నుంచి నువ్వేం భయపడాల్పిన పనిలేదు. అసలు నీ ఇబ్బంది  ఏమిటో స్పష్టంగా నాతో చెప్పు అని అడిగాను.
నా వైపు చూసి నీరసంగా  ఓ నవ్వు నవ్వింది ఆకాశం.
ఆ నవ్వుకి అర్థాన్ని వెతకడానికి ప్రయత్నించాను కానీ ... తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నేను సైకియాట్రిస్టుని కాదు కదా... అందుకే ఆకాశంతో స్పష్టంగా చెప్పాను.
నువ్వలా నవ్వితే నాకెలా తెలుస్తుంది. నువ్వు సరిగా లేవనే విషయం అయితే వాతావరణ పరిస్థితులను బట్టి నాకు అర్థమైంది. విపరీతమైన ఎండలు... పడని వానలు.. చూసి నీకు సమస్య వచ్చిందనేది తెలిసిపోయింది. మనుషులకి వచ్చినట్టే నీక్కూడా హార్మోన్ సమస్య వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే ఆ సమస్యతో బాధపడే మనుషుల ప్రవర్తన కూడా ఇలానే ఉంటుంది కాబట్టి. వాళ్లని టెస్ట్ చేయడానికి అయితే బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. నిన్ను టెస్ట్ చేయడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.
బుర్ర ఎంత గోక్కున్నా అదెలాగో అర్థం కాలేదు.
బుర్ర ఎక్కువేపు గోక్కుంటే రక్తాలు కారతాయని కాబోలు ఓ నాలుగు చినుకులు విదిల్చింది ఆకాశమ్మ. ఆ నీళ్లని టెస్ట్ ట్యూబ్ లో  నింపి ల్యాబ్ టెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు చినుకులు పట్టాను కూడా. కానీ ఎక్కడ టెస్ట్ చేయాలబ్బా... పెద్ద చిక్కే వచ్చి పడింది.
 దానికోసం కూడా గోళ్లు కొరుక్కుని, జుట్టు పీక్కుని ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చిందే కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ అపార్ట్ మెంట్ టెర్రస్ పైకి ఎక్కి ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టుకుంటూ ఆలోచించాను(పగలు అనుకునేరు. రాత్రిపూట). లాభం లేకపోయింది. తెల్లవారు జామునే నిద్రలేచి మళ్లీ అదే పని మొదలుపెట్టాను. కాసేపటికి ఎండ చుర్రు మనిపించింది.
దాంతో పాటు  ఒక విషయం చెప్పకనే చెప్పింది ఆకాశమ్మ.
 అవును  ఇది హార్మోన్ సమస్యే ... మనుషుల జీవనవిధానంలో, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు వాళ్లకి ఎలాగయితే హార్మోన్ సమస్యను తెచ్చి పెడుతున్నాయో. ఆ మనుషులు చేసిన, చేస్తున్న తప్పిదాలే నాకూ సమస్యను తెచ్చి పెట్టాయి. భవనాలు కట్టుకుంటే కట్టుకున్నారు చుట్టూరా నాలుగు చెట్లు నాటొచ్చు కదా... డెవలప్ మెంట్ అంటూ రోడ్లు, మెట్రోలు నిర్మించుకుంటే నిర్మించుకున్నారు. చెట్ల మీద వేటు వేయకుండా ఉండొచ్చు కదా. ఇలానే నాకు సంబంధించిన ఎన్నో విషయాల్లో నాకు సాయం చేసే ఎన్నింటినో మీరు నాశనం చేస్తూ వచ్చారు. అందుకనే రుతువుని బట్టి నా ప్రవర్తన ఉండడం లేదు. ఇది నాకు మనుషులు తెచ్చిన హార్మోన్ ప్రాబ్లమ్. దీనికి మందు మీరెవరూ కనుక్కోెలేరు. నేచర్ నేచురల్ గా ఇవ్వాల్సిందే.... అని గుక్క తిప్పుకోకుండా వివరించింది.

అంతా విన్నాక నీనో వెర్రి నవ్వు నవ్వి... దీర్ఘాలోచనలో పడిపోయాను. అప్పుడు కూడా ఆకాశమే మాట్లాడింది... ఒక్కదాన్నే  ఏం చేయగలను ఆలోచిస్తున్నావా. నువ్వు మొదలుపెట్టి... కొనసాగించు. నీతో మరో నాలుగు అడుగులు పడకపోవు అంది.
నేను వెళ్లేముందు... నీకు, నీతోపాటు మానవులందరికీ మరో విషయం చెప్పాలి. మొక్కలు నాటాం అవే పెరుగుతాయి... అని చేతులు దులుపుకోవద్దు. అలా చేయడానికి మీరు మొక్కలు నాటింది వనారణ్యంలో కాదు... జనారణ్యంలో. అందుకే వాటి బాగోగులు చూసుకోవాలే తప్ప మొక్కలు నాటాం అని చేతులు దులుపుకోవద్దేం అంది.
ఆ చివరి మాటలు ఛర్నాకోల్ పట్టుకుని చరిచినట్టే అనిపించాయి. నాకొక్కదానికే కాదు... మీక్కూడా కదా...

Thursday, May 12, 2016

నేను చూసిన ఎదవల గురించి ...

ఒక్కో వారం ఒక్కో ఎదవ గురించి నా బ్లాగ్ లో రాద్దామని మొదలు పెడుతున్నాను . మీరు కూడా మీ జీవితంలో ఎదురైనా ఎదవన్నర ఎదవలు ఎవరైనా ఉంటే  సుబ్బరంగా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు...
త్వరలో  మొదటి ఎదవ గురించి ఇక్కడ చదవొచ్చు ....

ఈ పోస్టులో ఏ వెధవకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలో అర్థం కావడంలేదు... అది తెలియగానే మొదలుపెట్టేస్తాను... అప్పటివరకు బ్రేక్ 

Thursday, October 1, 2015

డాక్టర్ గోఖలే

Thursday, September 24, 2015

 గోల్ కీపర్

సుందర్ పిచై

రికవరీ హోం


గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం