Sunday, December 19, 2010

ఫెనికి కవి కీట్స్ వ్రాసిన లేఖ


నేను నీకు ఒక లెటర్‌ వ్రాసాను. నువ్వు నీ తల్లిని కలుసుకున్నావని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ లెటర్‌ నీకు పంపడం అనేది నా యొక్క స్వార్ధం అవుతుంది. ఎందుకంటే ఇది నిన్ను కష్టపెడుతుంది అని నాకు తెలుసు. నీ ప్రేమ నన్ను ఎంతో బాధకి గురిచేసింది. నిన్ను నా ప్రేమవైపు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, చేసాను. నీ హృదయంలో నాకు పూర్తి ప్రేమను ఇవ్వు.

ఈ ఒక్క మాట మీదే నా జీవితం ఆధారపడి ఉంది. ఇందులో ఏ మాత్రం మార్పు వచ్చినా నా హృదయం విరిగిపోతుంది. నాకు నీ మీద చాలా ఆశ ఉన్నది. నా గురించితప్ప వేరే ఏ వస్తువు గురించి నీవు ఆలోచించవద్దు. నేను ఈ లోకంలో ఉన్నా, లేకపోయినా నన్ను మరచిపోవద్దు. అయినా నన్ను మరచిపోయావా అని అడగడానికి నాకు ఏమి అధికారం ఉన్నది.

బహుశ నువ్వు నన్ను రోజంతా గుర్తు తెచ్చుకుంటావేమో. నీ సంతోషం వదులుకోమని చెప్పడానికి నాకు ఏమి అధికారం ఉన్నది. కాని నన్ను క్షమించు. నేను ఈ విధంగానే అడుగుతాను. నీకు ఒక విషయం తెలుసా, నా మనసులో ఎంత తీవ్రమయిన కోరిక ఉన్నదో. అదేమిటంటే నేను ఏ విధంగా అయితే నిన్ను ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అదే విధంగా ప్రేమించానని, నువ్వు నన్నే ప్రేమిస్తున్నానని వేరే ఎవరిని ప్రేమించడం లేదని నువ్వ నాకు వ్రాసినట్లు నాకు అనిపిస్తుంది.
నిన్న మరియు ఈ రోజు ఉదయం కూడ నీ తియ్యని రూపం నా కళ్ళలో నిండి ఉంది. చాలా సమయం నేను నిన్ను కట్టెలు కొట్టుకునే అమ్మాయి రూపంలోనే చూసాను. నా యొక్క ఇంద్రియాలకి ఎంత కష్టమో ఇది అనుభవంలోకి రావడానికి. నా హృదయానికి నీ యొక్క ఈ రూపం ఎంత చక్కగా కనిపించిందో నా కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా కారాయి. నిజమయిన ప్రేమ హృదయాన్ని విశాలం చేసి దాని నిండా నిండి వుంటుందని నేను భావిస్తున్నాను.

నువ్వు ఒంటరిగా పట్టణం వెళ్లుతున్నావని విని బాధకలిగింది. కాని ఈ విధంగా అవుతుందని మొదట నుండి భయం ఉంది. నా పరిస్థితి కుదుట పడే వరకు ఈ విధంగా చెయ్యనని నాకు మాట ఇవ్వు. నాకు ఈ విధంగా మాట ఇచ్చి, ఈ నీ ఉత్తరంను తియ్యని భాషతో నింపి నాకు పంపు. ఈ పని నువ్వు మనసుపెట్టి చెయ్యకపోతే, నా ప్రియా, నాకు వివరంగా అంతా చెప్పు.

నీ హృదయాన్ని నా ముందు తెరచివుంచు. ఒక వేళ నీ హృదయం సంసారపరమయిన సుఖాలవైపు ఉంటే ఈ నిజాన్ని నా ముందు ఉంచు. నువ్వు నాకు చాలా దూరంలో ఉన్నావని నేను అనుకుంటున్నాను. నేను నిన్ను నాలో పూర్తిగా కలుపుకోవాలి అని అనుకోవడం కష్టం కాదని భావిస్తున్నాను. నీకు ఇష్టమయిన నీ పెంపుడు పక్షి పంజరంలోని తప్పించుకుని ఎగిరిపోయినప్పుడు, అది కనిపించే వరకు నీ మనస్సు ఎలా బాధపడుతుందో అలాగే నేను కూడా.. అలాగే నన్ను కూడా భావించు.
సరే ఏదైనా కానీ, నీకు
నేను తప్పించి వేరేం కావాలో చెప్పు.. నిన్ను కొంచెమైనా సంతోషంగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. నిన్ను నీ యవ్వనాన్ని అనుభవించవద్దని నేను చెప్పడం అనేది నా స్వార్ధమే కాక చాలా క్రూరం. ఒక వేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు ఈ విధంగానే అనవలసి ఉంటుంది.


నా ఆత్మ వేరే ఏ విధమయిన మాట వైపు సంతృప్తి అవడం లేదు. ఒక వేళ నువ్వు ఫాంటీస్‌లో ఆనందం పొందాలి అనుకుంటే నీ సంతోషంను పంచుకో, ఎవరి ఎదురుగానైనా నువ్వుకో, వారు ఎవరైనా నిన్ను ప్రశంసిస్తే వాటిని అందుకో. నీ యొక్క ప్రేమను పొందడమే నా జీవితం. నా ప్రేయసీ నన్ను నీ ప్రేమకు విశ్వాసంగా తీసుకో. ఒక వేళ ఏదో ఒక విధంగా ఇది నువ్వు నమ్మకపోతే నేను ఆ బాధతోనే చనిపోతాను. ఒక వేళ మన ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడితే మన ఇద్దరం వేరే స్త్రీ-పురుషుల మాదిరిగా ఉండడం అనేది జరగదు.

నువ్వు నాకే సొంతం కావాలి. నీ ప్రేమ నా కోసం ప్రాణాలు విడిచేందుకైనా సిద్ధమవ్వాలి. నా వల్ల ఎవరికి కష్టం రాకూడదు. నువ్వు ఈ ఉత్తరాలన్నీ చదివి ఆలోచించి నేను ఎంత కష్టాలు పడివుంటానో ఆలోచించు. ఒక వేళ నువ్వు నా సొంతం కానట్లయితే నేను జీవించీ వ్యర్ధమే. నన్ను బ్రతికించుకుంటావో మరణశిక్ష విధిస్తావో అంతా దైవలీల.

జాన్‌ కీట్స్.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం