Saturday, March 28, 2009

ముసుగు మనసుకు కాదు

టు వీలర్ డ్రైవింగ్ చేసేందుకు హైదరాబాద్ లో అమ్మాయిలు కాస్త పకడ్భందీగా బయటకి వస్తారు . తలకి స్కార్ఫ్, చేతులకు గ్లౌసేలు, మొత్తంగా కవర్ చేసుకుంటూ ఒక జీన్ జాకెట్ వేసుకుని బయటికి వస్తారు. ఇది చూసిన చాలా మంది మగవాళ్ళకు అమ్మాయిలూ స్టైల్ కొట్టడం కోసమే అలా వేసుకున్నరనుకుని రకరకాల కామెంట్స్ పాస్ చేస్తూ అమ్మాయిలను తెగ ఇబ్బంది పెడుతుంటారు.
ఇదే డౌట్ ను వ్యక్తం చేసారు నా కొలీగ్ ఒకరు .
ఆ అరెంజేమంట్ఎందుకో చెప్పిన తరువాత. . . ఆ అరణ్జేమేంట్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో వివరించిన తరువాత. . . అయ్యో ఆ వేషం వెనుక అంత విషయం ఉందా అని ఆస్చార్యాన్ని వ్యక్తం చేసారు.
అందుకే మహానుభావులారా . . . ముసుగు ఎన్నో ఎలిమెంట్స్ నుండి రక్షించుకోవడానికి ముఖానికే కానీ మనసుకి కాదు అని అర్ధం చేసుకోండి.
సరేనా

Thursday, March 26, 2009

ennikalu . . . cinemalu. . . TV channels

ఎక్కడ చూసినా ఒకటే హడావిడి . . ..
ఎన్నికలు, సినిమాలు ఏకమై పోయినట్టు అనిపిస్తోంది. ఇదివరకు కనీసం ఎంటర్ టైన్మెంట్ సినిమాల్లో కనిపిస్తుంది.. .
కనీసం ఎటువంటి కాస్ట్ ఫీలింగ్ లేకుండా సినిమా వాళ్ళను ఇష్టపడేవాళ్ళు జననాలు. అది ఇది వరకు సంగతి. . .
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు . . . పాలిటిక్స్ నుండి కుల రాజకీయాలు సినిమాలకు చేరాయి. .
సారీ చేరాయి అనేకంటే . . . బాగా అంటాయి అంటే బాగుంటుందేమో. . .
అదేంటో ఎక్కడా క్లారిటీ కనిపించడం లేదు. . .
ప్రజలకి, వార్తలకి వారధిగా నిలిచే మీడియా లో కూడా. . . ఒక్కోకరిది ఒక్కో పార్టీ, ఒక్కో వర్గం. . .
ఇదే కారణమో లేకపోతె, పొలిటికల్ డ్రామా లో సీన్ సేక్యూన్స్ బ్రేఅక్ అవుతుందో తెలియదు కాని. . .
ఎవరికీ క్లారిటీ లేదనే విషయం అయితే అర్ధం అవుతోంది . . .
అంతెందుకు ఆ కన్ఫూసన్ మామూలు మనుషుల్లో కూడా నిండింది . . .
అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే..... నేనే..... నేనే .... ఎందుకంటే నేను ఒకటి రాద్దామని మొదలు పెట్టి మరొకటి ఏదో రాసాను.
అంత కంఫ్యూజన్ వచ్చేసింది . . .

కాంగ్రెస్, టి డి పి, టి ఆర్ ఎస్, సి పి ఎం, సి పి ఐ, ఎం టి పి పి పి , . . . . అయ్యా బాబొయ్ చెప్పుకుంటూ పొతే కాలనీకో పార్టీ ఏర్పదేట్టు ఉంది. . .
ఏడ్చినట్టే ఉంది రాజకీయాల గోల.
అంటే ఏడ్చినట్టు ఉంది సినిమా వాళ్ల జంప్ జిలానీ వ్యవహారం . . .
ఇంకా. . . చెప్పడానికే వీలు కాని విధంగా, ఏదోలా ఉంది మీడియా వ్యవహారం. .
ఒక పక్క ఆర్ధిక మాంద్యం , మరో పక్క రాజకీయాల గోల
ఇన్ని గోలల మధ్య సామాన్య మానవుడు ఏమవుతాడో . . .????????????????????
కొన్ని మిలియన్ కోట్ల ప్రశ్న?

అందరూ ప్రజలకి ఏదో చేసేస్తామని చెప్తున్నారు కానీ ఏమి చేసారు ఇంతవరకు ఇక ముందు ఏమి చేస్తారు అనేది మాత్రం చాలా అర్ధం కాని విషయం . . .

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం