Thursday, October 29, 2009

కొండా సురేఖకి అంత ఇబ్బందిగా ఉంటే. . .

రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన వెంటనే ఎక్కువగా బాధ పడిన మంత్రులలో కొండా సురేఖ గారే ఉన్నారు. ఇదంతా కూడా ఆమెకు పర్సనల్ గా ఆయనతో ఉన్నా అనుబంధం కావొచ్చు.
అయితే . . . ఆమె కరెక్ట్ గా ఇప్పుడు రిజైన్ చేయడం వెనక ఉన్నా ఆంతర్యం ఏమిటి?
ప్రజలు అందరూ కలిసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే. . . వాళ్లు తమ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్ట్టి, నా మనసు బాధ పడింది కాబట్టి నేను రిజైన్ చేశాను అంటే అదే ఒక ప్రజా ప్రతినిధిగా ఎంతవరకు సమంజసం?
అంటే వీళ్ళకి స్వప్రయోజనాలే తప్ప . . . ప్రజల సమస్యలు కానీ, ప్రజల బాగోగులు కానీ పట్టవా?
ఇప్పటి రాజకీయ నాయకులని చూస్తుంటే. . . డబ్బులు సంపాదించాలంటే రాజకీయాలు ఒక మంచి టూల్ అని చెప్పే విధంగా ఉన్నాయి .. .
ఎందుకొచ్చిన రాజకీయాలు. . .
టాటా బిర్లా లాగానో, అంబాని సోదరుల్లానో వ్యాపారాలు చేసుకుని జనాల్ని దోచుకోక. .
ప్రజల కోసం అంటూ వచ్చి, ప్రజల సేన్సిటివిటి తో ఆడుకోవడం ఎందుకు?
నాయకుల సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ప్రజల మనోభావాలతో ఆటలాడితే మీ పునాదులు కదులుతాయి జాగ్రత్త. . .

Wednesday, October 28, 2009

తెలంగాణా తెరపైకి

తెలంగాణా తెరపైకి ఎప్పుడెప్పుడు వస్తుంది. . .
అసలు కెసిఆర్ కి తెలంగాణా రావడం కోసం ఏమైనా మనస్పూర్తిగా చేయాలనీ ఉందా. . . లేకపోతె రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు ఇదొక ఇష్యూ ఉంది కదా అని అలా తెరపైకి వస్తుంటారా ?

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం