Friday, September 26, 2008

లిఫ్ట్ లో . . .

ఆఫీసు లిఫ్ట్ లో ఒక్కదాన్నే వెళ్తున్నప్పుడు కరెంటు పోయింది . . .
ఒక క్షణం ప్రాణం పోయినంత పని అయింది . . . పర్వాలేదు కరెంటు వస్తుంది . . . జనరేటర్ వేస్తారు అని నా మనసుకి నచ్చచేప్పుకున్నప్పటికి . . . జనరేటర్ ఆన్ అయ్యి లిఫ్ట్ స్టార్ట్ అయ్యే లోపు బుర్ర రక రకాలుగా ఆలోచించింది . . . అది కూడా క్లోస్డ్ లిఫ్ట్ కావడంతో ఎక్కువ సేపు కరెంటు రాకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. . .
చ ఇప్పటివరకు బతికి ఇలా లిఫ్ట్ లో ఊపిరి పొతే ఏమిబాగుంటుంది . . . అని ఒక వైపు . . .
క్లోస్డ్ లిఫ్ట్ లు కి బదులు గ అన్ని లిఫ్ట్ లు ఓపెన్ గ ఐరన్ జాలీలతో ఉంటే ఎంత బాగుండు అనిపించింది . . .
అసలు ఆక్సిజన్ ఎంతసేపు ఉంటుంది . . .?
ఈ ఆలోచనలు ఒకవైపు బుర్రని తినేస్తుంటే . . . . చూపు లిఫ్ట్ పైకి వెళ్ళింది . . . పైన ఫ్యాన్ కోసం పెట్టిన గ్యాప్ తప్ప ఎక్కడ ఖాలీ కనిపించలేదు . . ..
దాంతో ఇక ఒళ్ళంతా చెమటలు పట్టిన ఫీలింగ్ వచ్చింది . . . అప్పుడే హన్డ్బాగ్ చేతికి తగిలింది . . . బాగ్ లో ఉన్నా మొబైల్ చేతిలోకి తీసుకుని కొలీగ్ ప్లస్ ఫ్రెండ్ స్వాతి కి ఫోన్ చేసి పరిస్తితి చెప్దాం అనుకున్నాను . . .
ఇంతలొ పవర్ వచ్చింది . . . కాని లిఫ్ట్ కదలలేదు . . . ఫ్లోర్ బటన్స్ అన్నీ బ్లాంక్ గానే ఉన్నాయి దాంతో ఇదేంటి పవర్ వచ్చిన తరువాత కూడా లిఫ్ట్ కదలడం లేదు అని . . . . ఇంకా టెన్షన్ ఎక్కువైంది . . . .
ఇక స్వాతి కి ఫోన్ చేద్దాం అనుకుంటుంటే లిఫ్ట్ కి ప్రాణం వచ్చింది . . . దానితో పాటు నాకు కూడా. . . .
బాబోయి లిఫ్ట్ ఆగింది బహుశా ఒక్క నిముషం కూడా పూర్తిగా అయి ఉండదు కాని . . . ఆ అరవై సెకండ్స్ లోనే ఇంట గందరగోళం జరిగింది . . .




Wednesday, September 24, 2008

రక్ష అంటే . . .

రక్ష అంటే . . . ఏమిటి అని ఆలోచించాల్సిన పరిస్థితిని . . . మన న్యూస్ చానల్స్ కలిపిస్తున్నాయి . . . ఒక ఛానల్ తరువాత మరొక ఛానల్ లో వరసగా రక్షా సినిమా గురించిన చర్చలు. . . ఒక ఛానల్ లో ప్రమోషన్ ఐతే మరో ఛానల్ లో అసలు చేత బడులు ఉన్నాయా అని చర్చ. . . టీవీ లలో ఏదో ఒక షో నడవాలి కాబట్టి ఇటువంటి షో లు చేస్తున్నారు అనుకుని సరిపెట్టుకుందాము అంటే . . . . రక్ష సినిమా డైరెక్టర్ వంశీ కృష్ణ మాటలు విన్న తరువాత మనసు ఉండపట్టలేక రాయాల్సి వచ్చింది. . .అసలు బేసిక్ గా రక్ష సినిమా పోస్టరు చూసినప్పుడే చాలా చిరాకుగా అనిపించింది . . ``మీకు ఎప్పుడైనా చేతబడి జరిగిందా `` అంటూ ఉన్న పోస్టరు చూస్తేనే . . . తెలియకుండానే మనసులో ఒకలాంటి జలదరింపు కలిగింది . . .
జనరల్ గానే సినిమా ప్రభావం పబ్లిక్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది . . . అదే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు కూడా. . ee cinema director ki asalu prajala gurinchi kaani . . . samajam gurinchi kaani ee maatram avagahana ledu ane vishayam tv9 vallu chepattina charchalo tetatellam ayipoindi. .. .
janavignana vedika ramesh . . . ee cinema directorki chetabadula meeda avagahana ledu anukunta ani ante. . . anduku aa director samaadhanam gaa. . . meeru chetabadule levani antoo malllee naa avagahana gurinchi maatladatarenduku annadu. . .
nizaaniki chetabadi ane moodhanammakanni paaradoladaaniki konni years ga endaro prayatnistunte ippatike 100 percent saadhayamavvaledu. . .
madhyalo ituvanti cinemalu teesi prajalloki vadilestunte. .. ela?
Ilaanti vaati gurinchi evaraina gattiga adigite. . . meeru choostunnaru kaabatti memu teestunnam ani cheptuntaru? commercial ga success gurinchi maatrame alochistoo . . .janalni chaavagotte badulu. . . burralu paadu cheyakunda . . . baagu chese vidhamaina cinemalu teeyochhu kada.. .
Asalu censor board emi chestondi???????
panikiraani chettani nirdhakshinyamga . . . enuku pakkaku pettadamledu ane prasna raaka maandu. . .
monnati varaku .. . EXposing cinemalaku permission ichhi. . . MOoDHANAMMAKALANU PEMPONDINCHELA unna cinemalanu chooste theda teliyakunda kallu moosukupoyayemo. . .
society ni baagu cheyalanukunte meeru chese chinni saayam censor correct ga cheyadame. ..
Alage cinema vaallu memu induku teesamu. . . indulo ee element baagundi. .. aa element baagundi ani cheppadam maanandi. . .
Meeku elagu mee prayojanaale tappa. ..
prajala gurinchi elaagu alochinchaleru paapam. . . adi vaalla dourbhagyam. . .
Anduke cinema vaallu meeru . . . manchi cheyakapoyinaa parvaaledu kaani. . . chedu maatram cheyakandi. . .PLZ..

Sunday, September 21, 2008

డర్టీ పాలిటిక్స్ . . .

politics లో నిస్వార్ధంగా పనిచేసే వాళ్ళను చూడాలంటే సాధ్యమవుతుందా ?
పేపర్ chadavaalante భయం. . . టీవీ చూడాలంటే టెన్షన్ పడాల్సిన పరిస్తితులు నెలకొన్నాయి . . . endukantaaru? emee ledhu simple reason . .. political mark thitlu chadavaalsi. .. choodaalsi raavadame. . . .
Asalu politicsloki raavaalante. . .
పాలిటిక్స్ లోకి రావాలంటే . . . ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ తిట్లు బాగా వచ్చి ఉండాలి. . .
సామాజికాంశాల పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం అస్సలు లేదు . . .
ముష్టిఘాతాలు వచ్చి ఉండాలి . . .
ఎవరూ. . . ఎప్పుడూ. . . వినని తిట్లు వచ్చి ఉంటే అదనపు క్వాలిఫికేషన్. . .
ఒక్క పోలిటిసియన్ అయినా . . . బయట ఏమి జరుగుతోంది ? ఏమి చేస్తే బాగుంటుందో. . . అని ఆలోచిస్తున్నారా ?
కనీసం ఈ సారి అయినా . . . పూర్తిగా నిస్వార్ధంగా కాకపోయినా. . . కాస్తైనా పక్కవాళ్ళ గురించి ఆలోచించగలిగే వాళ్ళను ఎన్నుకుంటే బాగుండు . . అది చేయాల్సింది మనమే . . .
సరైన వాళ్ళను ఎన్నుకోగాలిగితే మనం సేఫ్ . . . ముందు తరాల వాళ్లు కూడా సేఫ్. . .
ఏమంటారు ?
సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ది గుడ్ పర్సన్ . . .
హొపే ఫర్ గుడ్ సొసైటీ . . .

సండే అయిపోయింది

సండే ఒక్కరోజే ఎందుకు ఫాస్ట్ గా అయిపోతుంది?
సండే ఒక్కరోజుకి రెండు పగళ్ళు. . . రెండు రాత్రుళ్ళు ఉంటే ఎంత బాగుండేదో. . .
కావలసినంత రెస్ట్ దొరికేది కదూ . . . అత్యాస అనుకున్నా అందరు ఈ రకంగానే ఆలోచిస్తారని నాకు తెలుసు . . .

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం