Tuesday, April 28, 2009

ఎలాగైతేనేమి సంతోషించడమే కావాల్సింది

ఏమి చేయను? ఎలా చేయను?
ఎందుకు చేయాలి?
తప్పదా. . .
జీవితం
ఇష్టం లేని విషయం కష్టమైనా చేయాలి . . .
తప్పదు మరి
ఏమి చేద్దాం
ఇష్టం లేకపోయినా తప్పదు మరి
చేయక తప్పదు
* * * *
ఇష్టం ఉన్నపని చేయాలంటే?!
ఎన్నో అడ్డంకులు
ఆ అడ్డంకులన్నీ దాటి . . .
తమ మనసుకు నచ్చిన పనులు చేసే వారిని చూస్తె
ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది . . .
అప్పుడప్పుడు కాస్త కుళ్ళుగా కూడా అనిపిస్తుంది . . .
వాళ్ళనుకున్న పనులు వాళ్ళు చేస్తున్నందుకు
పోనీలే కనీసం వాళ్లైనా వాళ్ల మనసులని తృప్తి పరుచుకుంటున్నారు అన్నా ఆలోచన ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కూడా. . .
ఎలాగైతేనేమి . . .
ఆరోగ్య వంతమైన జీవితానికి కావాల్సింది సంతోషమే కదా.

1 comment:

chaitanya said...

కొంచం ఇష్టం కొంచం కష్టం
కొంచం ఈర్ష్య కొంచం ద్వేషం
కొంచం ప్రేమ కొంచం కోపం
ఇవన్నింటి మిస్రమమే జీవితం

అప్పుడప్పుడు మా బ్లాగ్ ని కూడా దర్శించ మని మనవి ఇట్లు
చైతన్య

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం