Thursday, February 11, 2010

మీడియా మీడియా ?

ఓ పక్క ప్రత్యెక వాదం
మరో పక్క సమైక్య వాదం
వాదం ఏమైతేనేం. . . . ఏదైతేనేం . . .
రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. . .
బంద్ లు, సమ్మెలు, రాస్తా రోకోలు

పోలీసు లాటీల హడావిడి, బూట్ల చప్పుళ్ళు ఒక వైపు
ఉద్యమకారుల ఆందోళనలు మరోవైపు
ఎవరు. . . ఎవరిని ఏమంటున్నారు?
ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు?
అంటా అయోమయం . . . గందరగోళం
ఇలాంటప్పుడే మీడియా పెద్దన్న పాత్ర పోషించి, వాస్తవంగా ఏం జరుగుతోంది అనే విషయాన్ని ప్రజలజు అర్ధమయ్యేలాగా చెప్పాలి.
ఇన్ని గొడవలు జరుగుతుంటే మీడియా తనవంతు పాత్రను ఎంత మేరకు నిర్వర్తిస్తోందనేదే ఇక్కడ చర్చనీయాంశం.
మరీ ముఖ్యం గా ఎలక్ట్రానిక్ మీడియా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే క్షణం క్షణం సమాచారాన్ని అందించడమే ఇందుకు కారణం.
ఒక రకంగా సమాచారాన్ని అందించడంలో మీడియా తనవంతు కృషి చేస్తోందనే చెప్పొచ్చు. అయితే ఇందులో ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇంత గొడవ జరుగుతుంటే రాష్ట్రం రావణ కాష్టం అవుతుంటే మీడియా ఏం చేస్తోంది?
మరీ ముఖ్యం గా ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేస్తుంది?
వంటి మీద కిరోసిన్ మంట రగులుతుంటే . . . కేమేరాలన్నీ ఆ వ్యక్తి మీద కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాయా?
తెల్లవారి అన్ని పేపర్లలో రకరకాల యాంగిల్ల్స్ లో ఆ వ్యక్తి ఫోటో పబ్లిష్ చేస్తున్నారా?
బస్సు ల పైకి రాళ్ళు విసురుతుంటే కెమెరాలు పగలకుండా (అఫ్కోర్సు కొన్ని కెమెరాలు పగులుతున్నయనుకోండి) వాటినీ షూట్ చేస్తున్నారా?
ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?

మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు. దేన్నైనా అత్యంత వివాదాస్పదమైన వార్తగా మలచగలదు. ఒకరకంగా చెప్పాలంటే సమస్యను సృష్టించగలదు. ఆ సమస్యకు పరిష్కార దిశని చూపించగలదు.
పరిష్కారం చూపడం అంటే మీడియా సర్వాదికారాలను తన చేతిలోకి తీసుకోవాలని కాదు. సామాన్య ప్రజానికాన్నీ దృష్టిలో పెట్టుకోమనే నా ఉద్దేశం. పెన్ను చూడగానే, మైక్ చూడగానే రెచ్చిపోయి మాట్లాడే సదరు పెద్దలను ఎందుకు నిలదీయడంలేదనేదే ఇక్కడి ప్రశ్న?

రాష్ట్ర విభజన అంటూ జరుగుతున్నా గొడవల్లో అన్ని రాజకీయ పార్టీలను ఒక దగ్గర కూర్చోపెట్టే ప్రయత్నం మీడియా ఎందుకు చేయడం లేదు? కూర్చోపెట్టినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరుకుతుందా! అంటే. జవాబు దొరకని ప్రశ్నే. శాశ్వత పరిష్కారం కాకపోయినా సమస్య తీవ్రతను తగ్గించే ఫలితమైతే తప్పక వస్తుంది. చర్చల వల్ల పోయేదేమీ లేదు. అయితే ఇక్కడ వార్తా సాధనాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చర్చల పేరుతొ వాళ్ళు కొట్టుకుంటుంటే ప్రేక్షక పాత్ర వహించకుండా మధ్యవర్తిగా ఉండగలగాలి.
ఒకటి రెండు చానెల్స్ ఈ పనిని చేస్తున్నాయి . ఇంకా చేస్తే బాగుంటుంది.
లైవ్ న్యూస్

టీవీ చానెల్స్ కు లైవ్ ప్రసారాల ద్వారా రేటింగ్ లు పెరుగుతాయి. ఇది చానెల్స్ కు ఒరిగే లాభం అయితే , లైవ్ లను ప్రసారం చేయడం వల్ల తక్షణ సమాచారాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇది ప్రజలకు ఒక రకం గా ఉపయోగం. అయితే లైవ్ ప్రసారాలు చాలాసార్లు ప్రజల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. ఎందుకంటే. . . ఏదైనా మనసును తాకే విషయాన్ని చూసినప్పుడు ఉద్వేగాలు రేగడం సహజం. ఇలాంటప్పుడే వార్తలను ప్రసారం చేయడంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రసారం చేయడం గురించేనా అని మీరనవచ్చు. ఇక్కడ టీవీ చానెల్స్ ను మాత్రమె ప్రస్తావించడం వెనక బలమైన కారణమే ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వార్తల్ని నట్టింట్లోకి మోసుకోచ్చేవి అవే కాబట్టి.
లైవ్ ప్రసారాల తీరు చాలాసార్లు విమర్శనాత్మకం గానే ఉంటోంది. ప్రాణాలు పోతుంటే ముఖం మీద కేమెర, మంటల్లో మండుతూ, నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఎక్స్ క్లూసివ్ స్టోరీ లు.
అయితే ఇలాంటి వాటి వల్ల నష్టమేనా? లాభం లేదా అంటే. . . లాభం కూడా ఉంది.
ఇందుకు ఉదాహరణ ప్రత్యెక రాష్ట్రం గురించి ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉద్యమం జరుగుతున్నప్పుడు జరిగిన ఓ ఘటన. ఉద్యమం చేస్తున్న విద్యార్దులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన నాగం జనార్ధన రెడ్డి పై జరిగిన దాడి. ఆ దాడి చేసిన వాళ్ళు విద్యార్దులు కారు, దుండగులు అనే విషయాన్ని గుర్తించి వారిని పట్టుకోగాలిగేలా చేసింది న్యూస్ చానెల్స్ రికార్డు చేసిన విజువల్సే. ఇది సంతోషించదగ్గ పరిణామమే. అయితే, ఇలాంటి మంచి శాతాన్ని, జరిగే చెడుతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పొచ్చు.

(పేరు gutuledu) కరీంనగర్ లో రోడ్ మీద ఒక మహిళను జుట్టు పట్టి ఈడ్చి ఘోరాతిఘోరంగా కొట్టి చంపినప్పుడు లైవ్ చూపించడం వల్ల ఒరిగింది ఏమిటి? అంతెందుకు ఒక టీవీ చానెల్ జనవరి ౭, 2010 న ప్రసారం చేసిన వై ఎస్ రాజ శేఖర రెడ్డి విమాన ప్రమాదంకి సంభందించిన మిస్టరీ గురించి మూడు నెలల తరువాత ఆ చానెల్ ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చింది? వాస్తవానికి ది ఎగ్జిలేడ్ అనే ఎల్లో జర్నలిజం పత్రిక ఆ విషయాన్ని ప్రమాదం జరిగిన రెండో రోజే ప్రచురితం చేసింది. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రసారం చేయడం వల్ల రాష్ట వ్యాప్తంగా ఎంత విద్వంసం జరిగిందో విదితమే.
ఇప్పటివరకు వేర్పాటు, సమైఖ్య వాదాలె రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాయనుకుంటే. . . వాటికి తోడు ఈ సమస్య కూడా గందరగోళ పరిస్థితులను రేపింది.

కర్నూల్ లో వరదలు వచ్చినప్పుడు రాత్రి పదకొండు గంటలకు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ సి ఇఎ వొ వార్తలు చదువుతూ రేపటి నుంచి మనం కర్నూల్ ని చూడలేం అంటూ ఒక స్తేటేమేంట్ ఇచ్చేసారు. ఆ సమయంలో అక్కడి పరిస్థితి మరీ అంత అద్వాన్నం గా ఏమీ లేదు. తెల్లారాక కర్నూల్ బాగానే ఉండే? బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యక్తి అలాంటి స్టేట్ మెంట్ లు ఇవ్వోచ్చా? అటువంటి స్టేట్ మెంట్ వల్ల ప్రజల్లో భయాందోళనలు ఎంతగా ఉత్పన్నమవుతాయి?

ఏది ఏమైనా వార్తల్ని ప్రచురించే ముందు, ప్రసారం చేసే ముందు వార్తల వెనక ఉన్న నిజానిజాలను, వాటి వల్ల సమాజం పై పడే ప్రభావం గురించి ఒక్కసారి ఆలోచించాలి రేటింగ్ ల కోసమో, మరింకేవో ప్రయోజనాల కోసమూ వార్తల్ని వండితే సమాజం ఏమి పోవాలి?

- ప్రాంతాల వారీగా గొడవలు జరుగుతున్నప్పుడు మీడియా రాజకీయ పార్టీలను, మేధావులను ఒక దగ్గర కూర్చో పెట్టి మాట్లాడించి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలి. చానెల్స్ లో వచ్చే చర్యలు సమస్యకు ఆజ్యం పోస్తున్నట్టు ఉన్నాయే తప్ప సమస్యకు పరిష్కారం అందించేలా ఉండడం లేదు.

- అలాగే మన జర్నలిస్ట్ సోదరులు ఎక్కడి నుంచైనా రిపోర్ట్ చేసేటప్పుడు పదాలు వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదనిపిస్తుంది. పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఉద్రిక్తంగా ఉందనో, లేకపోతె పరిస్థితి తీవ్రంగా ఉందనో, ఆందోళనకరం గా ఉందనో చెప్తే ఎలా? అఫ్కోర్సు అప్పుడున్న హడావిడిలో అదంతా గమనించుకునే టైం ఉండదు. అయినప్పటికీ కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిదేమో.

- ఇప్పటికే ప్రైవేటు ఎఫ్ ఎం రేడియోల్లో రిపోర్టర్ లను ఇమితతే చేస్తూ . . . కుక్క తోక వంకరెందుకు? పిల్లి ఏమంటోంది? అంటూ ఎన్నో సెటైరిక్ ప్రోగ్రాం లు చేస్తున్నాయి.

ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా ఇంతకుముందు కంటే ఇంకా ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.
సామాజిక, నైతిక విలువలకు కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం