Friday, September 19, 2008

బొత్తిగా అర్ధం కావడంలేదు. . .

ఏంటో . . . ఏమి చేయాలో అర్ధం కావడం లేదు . . . చాలా చేయాలనీ ఉంటుంది . . . కాని ప్రాక్టికల్ గా అమలు కావడం లేదు ఏమీ . . .
ప్చ్ . . . ఏమి చేయాలో థింకింగ్ . . . థింకింగ్ . . . థింకింగ్. . .
ఏదో ఒక ఎనర్జీ వచ్చి నాకు హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది . . .
ఇక జీవితమంతా ఇలానే ఉంటుందా? ఏమైనా మార్పు చోటు చేసుకునే అవకాసం ఉందా. . .
పాజిటివ్ గానే ఆలోచిస్తాను . . . మంచి జరుగుతుందనే ఆశిస్తున్నాను . . .

Thursday, September 18, 2008

చాలా భిన్నంగా మొదలైంది ఈ రోజు

ఉదయాన్నే బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది . . .
అందుకోసం నాలుగు గంటలకి నిద్ర లేచాను . . . ఎంత బాగుందో తెల్లవారుజాము . . .
వెండి వెన్నెల పిండారపోసింది . . .
అది కూడా మా ఫ్లాట్ బాల్కనీ లో . . . బాల్కనీలోనే అంత అందంగా కనిపించింది అంటే . . . ఇక నేల మీద ఆ వెన్నెల పరుచుకుంటే . . . . అబ్బో చెప్పడానికి మాటలు . . . వెతుక్కోవాల్సిందే . . .
ఆ తరువాత డైలీ లైఫ్ మొదలైంది . . .
ఇంతకీ నేను చెప్పోచ్చేది ఏమిటంటే . . . నిన్ననే badhakam గురించి మాట్లాడాను కదా. . .
ఆ బద్ధకాన్ని వదిలితే ఉండే ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ విషయం రాసాను
ప్రస్తుతానికి ఇంతటితో సెలవు

Wednesday, September 17, 2008

ఓ మంచి కల. . .

ee story నాకు వచ్చిన కల. . . ఆంధ్రజ్యోతిలోపనిచేస్తున్న రోజుల్లో . . . వచ్చిన నా కలను వసంత మామ్ ఇచ్చిన ప్రోత్సాహంతో కలని కథగా మార్చి రాసాను . . .

roju ila. . .

ఉదయాన్నే నిద్ర లేవగానే వాకింగ్ కి వేల్ల్ధమనుకుంటాను కాని అది ఎప్పటికీ సాధ్యం కాని టాస్క్ నాకు. . . అలారం మోగుతుంది . . . అది మోగగానే లేద్దాం అని కూడా అనుకుంటాను . . . కాని అలారం కంటే ముందు గానే నాలోని బద్ధకం అనే అలారం మోగుతుంది . . . ఇంకాసేపు ముసుగు తీయకుండా పడుకో అని జోకొడుతుంది . . .
అంతే . . . బద్ధకానికి దాసులం అయిపోవాల్సిందే కదా. . దానితో ఇంకాసేపు నిద్ర. . . అన్నింటికీ లేట్ . . .
ఆ తరువాత ఉరుకులుపరుగులు . . ..
ఇలా మొదలైంది ఈ రోజు . ..

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం