Monday, May 31, 2010

ఇంటర్మీడియట్ రిజల్ట్ లో

ఇంటర్మీడియట్ రిజల్ట్ లో వెలుగు చూస్తున్న దారుణమైన నిజాలను చూస్తుంటే. కడుపు తరుక్కు పోతుంది.

మేము టెన్త్ చదివే రోజుల్లో. మా స్కూల్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి బాగా చదివేవారు. చిన్న స్లిప్ టెస్ట్ పెట్టిన కూడా. వాల్లిద్దరిదే పోటి అన్నట్టు గా ఉండేది. అంత బాగా చదివే ఆ ఇద్దరు టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు.
ఇద్దరు తలకో సబ్జెక్టు పోగొట్టుకున్నారు. ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్య పోవడం మా వంతయింది ఎందుకంటే ఇద్దరూ మంచి క్లవర్ స్టూడెంట్స్. ఇక నా విషయానికి వస్తే మరీ అంత అత్తెసరుగా కాదు కానీ పర్వాలేదు బాగానే చదివేదాన్ని. అలాంటిది నాకు కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అప్పుడు రివాల్యుయే షన్ పెట్టిదామనుకున్నాము కానీ అప్పట్లో ఎందుకో కుదరలేదు.
ఇవ్వాళ న్యూస్ వింటే అప్పట్లో కూడా ప్రైవేటు స్కూల్స్ రిజల్ట్ బాగా రావడం కోసం . ఇలాంటి గోల్ మాల్ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది.
లేకపోతె సున్నా మార్కులు వచ్చిన పేపర్ కి డెబ్భైఐదు మార్కులు రావడమేంటి?
అంటా డబ్బు మాయం. డబ్బులు బాగుంటే మంచి కార్పొరేట్ కళాశాలలో చేరొచ్చు. మస్తు మస్తు గా మార్కులు తెచ్చుకోవచ్చు.
ఇలాంటి పద్ధతుల వల్లే డబ్బు ఉన్నవాళ్లకే మంచి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి.
అసలు పరీక్షలు వద్దు, పిచ్చి చదువులూ వద్దు అనిపిస్తోంది. చిరాకు పుడుతోంది.

2 comments:

శ్రీనివాస్ said...

వైఎస్ మరణించాక కూడా కేశవరెడ్డి సంస్థలకే ఫస్ట్ రాంకు రావడం నను ఆశ్చర్య పరిచింది. నా చేరశాల శర్మ కామెంట్ లాగ కనిపిస్తే నేనేం చేయలేను

ప్రేరణ... said...

అంతా మాయేనండి...

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం