Saturday, April 24, 2010

చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన ఐడియా ఇది . .

చిన్నప్పుడు ఒక ఆదివారం రోజు వచ్చింది ఈ ఆలోచన. . .
ఆ ఆలోచన మొన్న చాలా స్ట్రాంగ్ గా అనిపించింది.
ఆ గొప్ప ఆలోచన ఏమిటంటే . . .
మనం వెళ్ళే రోడ్ అంతటా టాప్ వేస్తె ఎలా ఉంటుంది అని. . .
అలా ఒక రూఫ్ లాగా వేసుకుంటే ఎండా నుంచి, వాన నుంచి, తప్పించుకోవచ్చు. అప్పుడు ఎండా కాలంలో స్కార్ఫ్ లు, వానా కాలంలో రెయిన్ కోట్ లు అవసరం లేకుండా ఉంటుంది కదా.
ఇలాంటిదే మరో ఆలోచన ఏమిటంటే ఇంట్లో ఎసి కి బదులుగా మనం వేసుకునే డ్రెస్ లే ఎండాకాలంలో చల్లగా. . . చలికాలంలో వెచ్చగా ఉండేవి మార్కెట్ లోకి వస్తే ఎంత బాగుంటుందో కదా. . .
ఈ రెండు ఆలోచనలే కాదు ఇలాంటివే బోలెడు వస్తుంటాయి.
మీ బుర్రల్లో కూడా ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటె. . . పంచుకోండి. . .
సరదాగా ఉంటుంది కదా.

4 comments:

సుభద్ర said...

అబ్బో బాగున్నాయి..నాకు చాలానే ఊహలు ఉ౦డెవి ఇలా౦టివి...
మచ్చుకి.........పత్తి చెట్టుకి బట్టలు కాస్తే......కోకోచెట్టుకి చాక్లెట్లు కాస్తే////////////
పెద్దలు లేని పిల్లల రాజ్య౦ ఉ౦టె.>>>>>అప్పిడప్పుడు పెద్దలు జస్ట్ విజిట్ కి రావాలి అ౦తే>>>
ఇ౦కో పెద్ద కోరిక ఏ౦ట౦టే ఓ ఉ౦గర౦ మాయ ఉ౦గర౦ నా దగ్గరు౦టే నేను కావాలనుకున్న జరిగిపోతూ ఉ౦డాలని....ఇలా నాకు పెద్ద లిస్ట్ ఉ౦ది.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

ఆఫీసు/స్కూలు తెరిచేటైముకి మెల్లగా, ఆతర్వాత అతిత్వరగా తిరిగే గడియారాలు మాత్రమే తయారవ్వాలని నాఅవిడియా

సత్యసాయి కొవ్వలి Satyasai said...

ఆఫీసు/స్కూలు తెరిచేటైముకి మెల్లగా, ఆతర్వాత అతిత్వరగా తిరిగే గడియారాలు మాత్రమే తయారవ్వాలని నాఅవిడియా

swapna@kalalaprapancham said...

hehe naku kuda anipistundi mi lage alochanalu.
inka office ki gate dataka ma buidling ki chala duram nadavali pina top emina veste bagundu anukunedanni.

alanti dresses gurinchi ekado chadivinattu gurthu.

edina oil lantidi veste vehicle lo polution lekunda undetatu unte bagundu anipistadi.

inka ATM'S lo evarina money draw chesukunetatpudu only face varaku tise camera pedithe bagundu anipistadi.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం