Sunday, April 18, 2010

గుబ్బకాయలు

గుబ్బ కాయలు . . . వీటినే సీమ చింతకాయలు అని కూడా అంటారు.
చిన్నప్పటి జ్ఞాపకంగా మిగిలిపోకుండా ఉండేదుకు. . . రోడ్ మీద తోపుడు బండ్లలో పెట్టి అమ్ముతున్నారు బాగానే ఉంది. సంతోషంగా అనిపించింది కూడా. . .
గుబ్బకాయలతో పాటుగా చింత చిగురు కూడా కుప్పపోసి పెట్టారు. . .
అది చూసి ఆహా ఇవ్వాళ రోడ్ చూసేందుకు ఎంత బాగుందో అనుకున్నాను మనసులో. . .
అంతటితో ఆగిపోతే అది మనసని ఎందుకు అనిపించుకుంటుంది. . .
గుబ్బ కాయలు తినాలనిపించింది . . . వెంటనే ఒక పక్కన ఆగి ఆ తోపుడు బడని దగ్గరకు వెళ్లి. . . గుబ్బకాయలను చూపిస్తూ ఎంత బాబూ అన్నాను. అతను చెప్పిన రేట్ విన్నాక. . . హా అని నోరు తెరుచుకుని ఉండిపోయాను కాసేపు.
ఆ తరువాత తేరుకుని . . .
బలంగా వాటిని తినాలన్నా కోరికని నొక్కి పెట్టాలనుకున్నాను. . . ఎందుకంటే అతను పావు కిలో ౪౫ (నలభై ఐదు ) రూపాయలు అనగానే. . . సెకండ్ లో ఒకటో వంతు గుండె ఆగిపోయింది కాబట్టి. . .
ఆ సెకండ్ లోనే చిన్నప్పుడు ఆడుకుంటూ గుబ్బకాయల్ని ఏరుకుని తిన్నానని. అలా తిని. . . మిగతావి గాల్లోకి విసురుతూ. . . పక్క వాళ్ళ పై విసురుతూ తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. . . అచ్చం సునామీలాగా చుట్టుముట్టాయి ఆ జ్ఞాపకాలు.
కానీ ఏమి చేస్తాం పొట్ట చేత్తో పట్టుకుని పట్టణానికి వచ్చాం కదా నలభై ఐదు ఏమి ఖర్మ. . . ఎనభై ఐదు అన్నా కొనుక్కోవాలి తినాలి తప్పదు. అది కూడా వాటి రుచి తెలుసు కాబట్టి ఆ కోరిక. . .
అదే సిటీలలోనే పుట్టిన పిల్లలకి ఐతే ఆ బాదే లేదు. . .
ఎందుకంటే వాటిని కొనాల్సిన అవసరమే లేదు. . .
కాస్తో కూస్తో పల్లె టచ్ ఉంటే తప్ప వాటి పేరు కూడా తెలియదు కాబట్టి.
కొనాల్సిన అవసరం రాదు. . . ఆ రేట్ చూసి గుండె దడా రాదు.
చివరకి కొన్నాను. బేరమాడి ఇరవై ఐదు రూపాయలకి కొన్నాను. ఆ పక్కనే ఇంకో కుప్ప చింత చిగురు కనిపించింది కాని. . . దాని రేటు అడిగితె చటాకు తొంభై అంటాడేమో అని.
మనసుని, నోటిని రెండిటిని కట్టుకుని వచ్చాను.
ఇదీ ఇవ్వాల్టి గుబ్బకాయ అదేనండీ సీమ చింతకాయ తెచ్చిన చింత.

9 comments:

swapna@kalalaprapancham said...

abba ennallu ayitundi gubbakayalu ane mata vini. naku kuda thinalanipistundi. chinnapudu epudo thinna, anthe. malli pedda ayyaka aa madya epudo anukokunda thinna. school lo unapudu school dagara amme vallu kuppaluga posi. chinna kuppa pedda kuppa ila undevi. 50 ps kani Rs.1 kani ala undevi rate. danito aa ginjalatho aata kuda adevallamu. miku thelise untadi.

Anonymous said...

సీమ చింత కాయలకు చాలా దారుణమైన పేరు పెట్టారు. :((

ఆ.సౌమ్య said...

ఇంత రాసాకా ఓ ఫొటో పెడితే కూడా బాగుంటుంది కదండీ, ఈ టపా చదివాక నాకూ తిన్నలనిపిస్తున్నది, కొన్ని యేళ్ళయింది తిని :(

Unknown said...

anonymous ani raayadame mee daakkune tatvaanni teluputondi.. ..
vaatini maa maandalikamlo Gubbakaayalane antaamu.
Telusukondi.

Mallesh Sampangi said...

gubba kaaya gurinchi baga chepparu... chinnappudu nenu chala teene vadini... seema chintakaya ..... gurthu chesinandu.... thank's.... kiran

Unknown said...
This comment has been removed by the author.
భావన said...

బాగుంది ఎన్నాళ్ళయ్యిందో సీమ చింతకాయలను చూసి కూడా, చిన్నాప్పుడు ఆ సీజన్ లో తిని తిని ఆ తరువాత పసరు కక్కి తిట్లు తినే దానిని బోనస్ గా.. :-)
అవి అంత ఖరిదా..ఏమి చేస్తాము లెండి మరి తప్పదు కదా.. వాళ్ళ శ్రమ కు విలువ అది తెచ్చినందుకు మరి. థ్యాంక్స్ అండి ఫొటో పెట్టీనందుకు.

నిజం said...

సీమ చింతకాయlu......wow.....enni thinnano chinnappudu...ma ammama valla intlo chettu vundedi....dani nundi thempatiniki entho kasta padevallam.....thanks gurthu chesinduku

Unknown said...

thatha rupai esthe class lo nene Bill Gates. Appatlo aa rupai viluva adhi. vatitho rendu chinna kuppala gubbakayalu konukkoni clas mothaniki oka kuppa panchi inko kuppa nenu thinevadni...ante nenu class ki Bill Gates ni ani aa roju prove cheskovali kadha. Okka sari thirigosthe entha bhavundu aa rojulu...

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం