Monday, February 15, 2010

కళ్ళు మూసుకుని . . .

పి పరిష్తితి ఏమిటి?
పాలకులు ఏమి చేస్తున్నారయ్యా? అంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారయ్యా అంటాను .
ఛీ. . . ఛీ . . . పాలు తాగడమేంటి అని పిల్లులు కోపగించుకున్నాయి.
ఆయ్. . . ముష్టిలాగా ఎ పి పాలిటిక్స్ తో . . . మమ్మల్ని పోలుస్తున్నారు.
మేము మీ ప్రపంచాన్ని బహిష్కరిస్తున్నాం. . . అంటూ కోపగించుకుమి పెద్దగా మ్యావ్ అంటూ కేకలు వేయడం మొదలు పెట్టాయి.
వామ్మో ఇంకా ఏమైనా ఉందా పిల్లులు మన రాజ్యాన్ని బహిష్కరిస్తే . . . ఎలుకలు పెరిగిపోయి సరుకుల్ని నాశనం చేస్తాయి .
మా బిజినెస్ దెబ్బతింటుంది. అంటూ వ్యాపారులు పరుగెత్తుకుని రాజకీయనాయకుల దగ్గరికి వెళ్ళారు. . .
ఆ తరువాత ఏమి జరిగిందేమిటంటే. . .
రేపటి రాజకీయ పరిస్తితి బట్టి మిగతా స్టొరీ రేపే రాస్తాను.
బుర్ర ప్రస్తుతానికి ఇంతవరకే స్టోరీని బిల్డ్ చేయగలిగింది. . .
వో కే నా .
పిల్లుల గొడవ తీర్చమని రాజకీయనాయకుల దగ్గరికి పరుగెత్తిన వ్యాపారులకు షాకింగ్ న్యూస్ ఏమిటంటే. . .
రాజకీయనాయకుల ఇళ్ళముందు ఉన్న గేట్స్ దగ్గర కుక్కలు భౌ భౌ అంటూ వ్యాపారుల మీదకు లగేత్తాయి . . .
వ్యాపారులు చెప్పులు చేతిలో, ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగెత్తడం మొదలు పెట్టారు.
వాళ్ళలో కాస్త ధైర్యం ఉన్న ఒక వ్యాపారి ఒక కుక్క దగ్గర ఆగి . . . నాకో చిన్న డౌట్ ఉంది . . .
ఇంతకీ మీరు మమ్మల్ని చూసి ఎందుకు అరిచి వెంటపడుతున్నారు అని అడిగాడు. అలా అతను అడగ్గానే కుక్క మళ్ళీ ఒకసారి భౌ అంటూ అరిచి, మీరు ఏనాడైనా . . . మాకు పప్పు ముద్దా అయినా పెట్టారా. కనీసం నాన్ వెజిటేరి యన్స్ అయినా ఒక చికెన్ ముక్క అయినా పెట్టారా అంటే అదీ లేదు.
రాజకీయనాయకులే నయం వాళ్ళు తింటూ మాకో ముక్క పెడతారు అందుకే వాళ్ళంటే మాకు ఇష్టం. మీరంటే చీదర. . . ఫో పొండి అంటూ, భౌ మంటూ మళ్ళీ అరవడం మొదలు పెట్టింది.
ఇంకా ఒక్క క్షణం అక్కడ ఉన్నా ఆ కుక్క మీద పడి కరిచెట్టు ఉందని ఆ వ్యాపారి పారిపోతాడు.
(ఇంకా ఉంది )

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం