Thursday, July 15, 2010

మన తెలుగుని కాపాడుకుందాం


సోదర సోదరీమణులారా...!

మన తెలుగును మనం కాపాడుకుందాం.

ప్రపంచంలోనే ఎక్కడా లేని

విధంగా మన తెలుగు భాష

అచ్చుతప్పులతో లిఖించబడుతూ

అల్లల్లాడిపోతోంది.

విషయం బోర్డునడిగినా...

గోడమీది రాతలనడిగినా

చెబుతాయి.

ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని

హైదరాబాదులో

కమర్షియల్

సైన్ బోర్డునైనా చూడండీ...

తప్పులు తండోపతండాలుగా

దొర్లుతుంటాయి.

ఇక టీవీల్లో స్క్ర్రోలింగు వగైరాల్లో కూడా

తప్పు దొర్లందే వార్తలు పూర్తికావడం లేదు.

మన తెలుగును కాపాడుకోవడంలో

భాషా సంఘం నిస్సిగ్గుగా నిద్దురపోతోందనడానికి

ఇంతకన్నా ఉదాహరణలు లేవు.

ఏదో ఒక ఉద్యమం చేపట్టి...

'సేవ్ తిరుమల' లాగా...

'మన తెలుగును కాపాడుకుందాం' అనే

నినాదంతో

ఏదైనా చానెల్ ముందుకు వెళితే...

తెలుగు భాషకు చానెల్ ఎంతో

మేలు చేసినట్టు అవుతుంది.

7 comments:

kRsNa said...

ఎస్ మన తెలుగుని మనం కాపాడుకోవాలి.

Anonymous said...

ముందుగా మన బ్లాగులతో మొదలెడదాం...

A K Sastry said...

అయ్యా!

మన హైదరాబాదు తెలుగు ఇప్పుడు చాలా బాగుంది.

ఓ పాతికేళ్ళ క్రితం, ఓ సెలూను ముందు "ఇచ్చట వేంఢ్రుకలు అంధముగా నఱకబడును" అనీ, ఓ పోస్టాఫీసు ముందు, "మన సోమ్ము సోష్టఫీసు సెవింగ్సు బ్యాంకిలో సురక్షితిం గా యుంటుంది" అనీ బోర్డులు వుండేవి! (ఇదివరకే నా టపాల్లో వ్రాశాను)

ఇక టీవీ ఛానెళ్లలో Scrolling టైప్ చేసేవాళ్ళూ, మన తెలుగు బ్లాగర్లలాంటివాళ్ళే కదా?

మన భాషా సంఘం గురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది--దానికి అధ్యక్షుడెవరో గుర్తుందా?

ఇక యే చానెల్ అయినా చేసేది యేముంటుంది--"కెమేరామన్ నర్సింగ్ తో, 'ఫలనా' టీవీ రిపోర్టర్ ఫలనా టీవీకి"--వనజా! అంటూంటేనే చెవుల్లో అమృతం పోసినట్టు లేదూ?

A K Sastry said...

అవశ్యం! మన బ్లాగులతోనే మొదలు పెడదాం!

ముందు 'అఙ్ఞాత' ముసుగుల్ని తొలగిద్దాం.

తరవాత, తెలుగు చదవడం, వ్రాయడం నేర్చుకుందాం.

ఆ తరవాత, ప్రపంచ చరిత్రా, భారత దేశ చరిత్రా, ఆంధ్ర రాష్ట్ర చరిత్రా తెలుసుకుందాం.

అంతవరకూ పినాకొ కామెంట్లు మానేద్దాం! (యెందుకంటే, వాటి వల్ల మన ముక్కేగా పెరిగేది?)

అందరూ ఆచరించండి మరి.

M.V.Anjaneyulu said...

your blog is very good

శివ చెరువు said...

Well said

భాను said...

mundugaa meru mudalettandi mee venuka meemuntam ok

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం