Sunday, April 12, 2009

ఎంతైనా మగవాళ్ళే గ్రేట్

అవును ఎంతైనా మగవాళ్ళే గ్రేట్. . .
ఎందుకంటే పొద్దున్నే లేచిన దగ్గరి నుంచి . . . .
ఇంట్లో అందరి అవసరాలు తీర్చేందుకు పరుగులు పెట్టక్కర్లేదు
ఎందుకంటే అంట్లు తోమక్కర్లేదు
ఎందుకంటే బట్టలు ఉతకక్కర్లేదు
ఎందుకంటే పచారి సామాను లెక్కలతో పనిలేదు
ఎందుకంటే వంటింటి తో అస్సలు సంబంధమే లేదు
ఎందుకంటే వంట చేయాల్సిన అవసరం. . .
అలాగే టీ, టిఫిన్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేనే లేదు
అందుకే . . . ఎంతైనా మగవాళ్ళు గ్రేట్
..........................

ఎంతైనా మగవాళ్ళు గ్రేట్
ఎందుకంటే ఇల్లు ఊడవక్కర్లేదు, తుడవక్కర్లేదు. . .
ఎందుకంటే పిల్లల చదువుల గురించి. . . .,
ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదు.
ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి. . .
వాళ్ల గురించి కూడా అప్పుడప్పుడే తప్ప, ఎప్పుడూ పట్టించుకోనక్కర్లేదు.
అంతెందుకు ఏ బిల్లూ కట్టక్కరలేదు. . .
అయిన మగవాళ్ళే గ్రేట్. . . .

. . . . . .. . .

ఎందుకంటే ఒకే ఒక్క పని
అమ్మో ఆఫీసు పని . . .
అది కూడా తల్లో. . ., పెళ్ళామో. . .
వేడి వేడిగా బ్రేక్ ఫాస్ట్. . ., లంచ్ బాక్స్ కట్టిస్తే . . .
దాన్ని భద్రంగా పట్టుకెళ్ళి ఏసి రూముల్లో (దాదాపు ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో ఎసి లు ఉంటున్నాయి కాబట్టి)
చెమటోడ్చి పని చేసి . . . తినాలి కదా
ఎంతోకష్టం . . .
అందుకే మగవాళ్ళే గ్రేట్ . . .
..........................................

ఆఫీసుల్లో కూడా వాళ్ళే గ్రేట్ .. . .
ఎందుకంటే తాను నచ్చే. . . .
జనం మెచ్చే పని మాత్రమే చేస్తూ. . .
వాహ్వా అనిపించుకుంటారు కాబట్టి
మగ వాళ్ళే గ్రేట్. .
(అందరూ కాకపోయినా కొందరైనా. . . . ఇలా చేస్తారు కాబట్టి)
అంతెందుకు పని తక్కువై అలసిపోయే . . .
మగ మహారాజుకి జీతం కూడా తగ్గదు
అందుకే వాళ్ళే గ్రేట్
.........................................

వాళ్లు గ్రేట్ కాదని మీరు అన్నారో . . .
మీరు తెలివిలేని వారు
ఆ పై బతకడం కూడా బహు కష్టం . . .
హుష్ జాగ్రత్త

ఎంతైనా మగవాళ్ళే గ్రేట్?! మరి. . . . .

12 comments:

Kathi Mahesh Kumar said...

అవును గ్రేటే మరి!!!

karthik said...

tittara leka pogidara? konchem clarify cheyyandi :) :)

emaina baga rasaru.


-Karthik

Anonymous said...

కాదనడానికేమీ కనిపించడం లేదు కిరణ్. కానీయండి. ఏం చేస్తాం? :)

Anonymous said...

veda gaaru naako doutu..
mee laanti feministulaku kapuram loo adjust avvagalara..
srusti lo ada maga iddaru samaname ani aloochinchandi ..family iddaru kastapadithene samasaaram nadusthundi
meeru antunna panulu evarina chesukovalisinde..

అనూ said...

wow..iraga.....i think v r on the same wavelenght.......
i do agree gents r really grtt!!!!!!!!!.....

పరిమళం said...

ఎంతైనా మగవాళ్ళే గ్రేట్
పొద్దున్న లేచి మనం పెట్టే
ఏ ఫెప్మాయో తిని ఉరుకుతూ
బస్ రష్ గా ఉన్నా
ఫుట్ బోర్డ్ పై వేళ్ళాడుతూ
పడుతూ లేస్తూ ఆఫీస్ కెళ్ళి
అక్కడ బాస్ కి సలాములు
తిరిగి బస్ కోసం పడిగాపులు
బైక్ ఉంటె ట్రాఫిక్ జాములు
యాక్సిడెంట్లు అన్నిటినీ
తప్పించుకొని బ్రతుకు జీవుడాని
ఇంటికి చేరితే పూలు మరచినందుకు
అలకలు ,వంటలో హెల్ప్ చేయనందుకు
ఆదివారం సినిమాకి తీసుకెల్లనందుకు
రుసరుసలు ..విసవిసలూ ..
పాపం కదండీ ...... :) :)
ఎంతైనా మగవాళ్ళూ గ్రేటే !
హుష్!మనలో మనమాటే లెండీ ! :)

asha said...

బాగా వ్రాశారు వేదగారు.
పై విషయాలలో వాళ్ళ గొప్పతనాన్ని కూడా
విస్మరించేంత గొప్పోళ్ళు వాళ్ళు.

బ్లాగాగ్ని said...

పొర్లి పొర్లి నవ్వలేక చచ్చా. మంచి కామెడీ కవితనందించినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

emma meeru kooda sandhya akka daggara, olga daggara train ayyara

Subba said...

Avunu. Enthaina Maga Varu great...
Endukante...

Bhartha ante Bharinchuvadu..
Bharya Ante Badhinchunadi...
(The Above lines are Just for Kidding)..

Mee blog chaduvuthu vunte navvu apukoleka poyanu..baaga rasaru.
Keep it up.

chaitanya said...

as you said andaru ala vundaru there are exceptions and aadavaarilo vunna goppa valla gurinchi kuda cheppukovaali,i will soon write a blog on the great people who happen to be aada vaaru :)
keep writing
chaits

ranganath said...

kiran gaaru..
mee aalochanalu baagunnai, kaani idi andaru magavaallaku vartistundanukunte porapate.
working women aina kakapoina,, jeevitantam todu needaga untu,, aame panullo paalupanchukuntu,,
bhartante bharinchevaaduga untu,,, tana swaartham kante bhaarya sukhame ekkuvanukune chaala mandi magavaallaku idi vartinchadu,, aina purushaadhikya samajaniki ippudika kaalam chellindi,, prastutam sthree samaanatwam viraajillutondi,, idi gamanistarani aasistu,,

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం