Sunday, July 4, 2010

వేదం - విలన్

ఈ మధ్య ఈ రెండు సినిమాలు చూసాను. చాలా రోజుల తరువాత సినిమా చూడటం వల్లనో, ఎందుకో కానీ రెండు సినిమాలు నాకైతే నచ్చాయి.
మరీ ముఖ్యంగా విలన్ సినిమా విషయానికి వస్తే. . . సినిమా కథాంశంలో రామాయణ పాత్రలే ఆధారం అనే విషయాన్ని అక్కడా, ఇక్కడా విన్నాం.
విక్రం నటన సూపర్ అని చెప్పొచ్చు.
ఇక మణిరత్నం దృశ్యాలను తెరకి ఎక్కించడం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చాలా మంది ఆ సినిమా నీకు ఎలా నచ్చింది అని అడిగితె నన్ను నేను ఒక ప్రశ్న వేసుకున్నాను.
అందరికీ నచ్చనిది నాకే ఎందుకు నచ్చింది అని. దానికి నా మనసు నాకు చెప్పిన సమాధానం. సినిమాలో పాత్రలని, దృశ్యాలను వేటికవి విడిగా చూడటం వల్లనేఅని
అన్నిటి కంటే ముందు ఈ రెండు సినిమాలు నచ్చడానికి.
ఈ మధ్య సినిమాల్లో చూపిస్తున్నట్టు గా మోతాదుకు మించి లేని శృంగారం, హింస వంటివే కారాణాలు కావొచ్చు.
ఏమో నాకైతే రెండు సినిమాలు బాగానే అనిపించాయి.
వేదం లో హీరినే అనుష్క డ్రెస్సింగ్ విషయానికి వస్తే. . . ఇవ్వాళ రేపు సినిమాల్లో, స్మాల్ స్క్రీన్ మీద హీరోయిన్స్, యాంకర్స్ వేసుకునే డ్రెస్ లతో పోలిస్తే వంద శాతం నయం గా అనిపించింది.

1 comment:

శివ చెరువు said...

నాక్కూడా వేదం నచ్చింది.. డ్రస్సు సంగతి నేను మాట్లాడను.. కాని..డయిలాగులు కధకి తగ్గట్టుగా రాసుకున్నా.. వాటివల్ల నేను కుటుంబ సమేతం గా వేదం సినిమా చూడలేనోమో అనిపించింది.. పబ్లిక్ రివ్యూస్ చూసి.నేను.. విలన్ చూడలేదు.

నవతరంగం.కాం చూడండి.. రెండు సినిమాల గురించి మంచి చర్చ జరిగిందిక్కడ..

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం