Wednesday, October 28, 2009

తెలంగాణా తెరపైకి

తెలంగాణా తెరపైకి ఎప్పుడెప్పుడు వస్తుంది. . .
అసలు కెసిఆర్ కి తెలంగాణా రావడం కోసం ఏమైనా మనస్పూర్తిగా చేయాలనీ ఉందా. . . లేకపోతె రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు ఇదొక ఇష్యూ ఉంది కదా అని అలా తెరపైకి వస్తుంటారా ?

2 comments:

Anonymous said...

తెలంగాణా సమస్య కే సి ఆర్ వ్యక్తి గత సమస్య కాదు !
తెలంగాణా ప్రజల్లో ఆ ఆకాంక్ష బలంగా లేకపొతే -
సమైక్య రాష్ట్రం వల్ల తెలంగాణాకు అన్నివిధాలా అన్యాయం జరగడం నిజం కాకపొతే -
తెలంగాణా సమస్య ఇట్లా ౫౦ ఏళ్ళు గా మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తూ వుండేదే కాదు.!!

కే సి ఆర్ మనస్ఫూర్తిగా తెలంగాణా రావడం కోసం ఏమైనా చేస్తున్నాడా అన్న సంగతి ని కాసేపు పక్కన పెట్టి -
ఆనాడు టీఆరెస్ తో పొత్తు పెట్టుకుని అధికారం లోకి వచ్చి పార్లమెంటులో రాష్ట్రపతి చేత , ప్రధానమంత్రి చేత అబద్ధాలు చెప్పించి, ప్రణబ్ కమిటీ తో నాటకాలు వేసి ఇప్పటికీ ఇంకా ఒక స్పష్టమైన,, నిజాయతితో కూడిన విధానాన్ని అనుసరించని కాంగ్రెస్ ను ఎందుకు నిలదీయరు ??

సమైక్య రాష్ట్ర నినాదాన్ని పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణా కు జై కొట్టి వోట్ల తంతు ముగియగానే తెలంగాణా విషయంలో నోటికి తాళం వేసుకుని "......." లా కూచున్న తెలుగు దేశం, బీ జే పీ, సి పీ ఐ పార్టీలను ఎందుకు నిందించరు ???

మూడు కోట్ల ప్రజలను ౫౦ ఏళ్లుగా వేశిస్తున్న తెలంగాణా సమస్య శాశ్వత పరిష్కా రానికి ఈ "......... "పార్టీలు ఎందుకు మనస్ఫూర్తిగా కృషి చేయవు.???
వీటికి బాధ్యతా లేదా ???

కే సి ఆర్ డ్రామాల ను అటుంచండి . ఈ మహా మహా పార్టీలు , మహా మహా నేతలు ఆడుతున్నది మాత్రం "........" నాటకం కాదా.???
ఆలోచించండి.

- ఒక తెలంగాణా సగటు మనిషి

Anonymous said...

baabu... sagatu telangana manishi... ee krindi vaatiki answer cheyyamma....


అసలు రాష్ట్ర విభజన సాధ్యమా ? అయితే ఏ విధంగా సాధ్యం ?

· అసలు సమస్య ప్రత్యేక తెలంగాన కాదు. మిగతా భాగాన్ని ఎన్ని ముక్కలు చెయ్యాలి ?

· ఒకప్పుడు రాయలసీమ కూడా తెలంగానలోనేదే, మేము తెలంగానతో పాటే వుంటాం అంటున్న కొందరి రాయలసీమ వారి గొడుకు సమాధానం ఏమిటి ?

· ఇంతకు ముందు ఆంధ్ర ప్రాంతంకు చెందిన ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతం ఆంధ్రకు చెందిందా లేక తెలంగానకు చెందిందా ?

· అసలు బౌండిర్స్ ఏమిటి ? ఎవరు నిర్ణయిస్తారు ?

· రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌పై రాజశేఖర్ రెడ్డి సృష్టించిన ప్రత్యేక హైదారాబాద్‌ పై సమాధానం ఏమిటి ?

· రాష్ట్ర విభజన వద్దు అనుకునే వాళ్ళను ఎలా సమాధాన పరుస్తారు ?

· ఇన్ని ప్రశ్నలకు సమాధానం లేకుండా, ఇదిగో తెలంగాన .. అదిగో తెలంగాన అంటూ .. తెలంగాన సెంట్‌మెంట్ తో రాజకీయ మనుగడ సాగిస్తున్న కెసిఆర్ చేతిలో మోసపోవడానికి అమయాక తెలంగాన ప్రజలు రెడీగా వున్నారా ?

· కెసిఆర్‌కు ప్రత్యన్నమయ మార్గం ఏమిటి ?

· చిరంజీవి కూడా కెసిఆర్ మాదిరే తెలంగాన సెంట్‌మెంట్‌తో రాజకీయాలు నడుపుతాడా ?

· తెలంగాన విషయంలో చిరంజీవి చూపించే ముందడగు ఏమిటి ?

· రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యటం వలన, నిజంగా అభివృద్ధి సాధ్యమా ? గ్యారంటీ ఏమిటి ?

· ఈ రాజకీయ పార్టీలు తెలంగాన ప్రజల సమస్యలు, హక్కుల పై పొరాటాలు ఎందుకు చె య్యరు ?


yours,
jasmine

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం