ఆఫీసు లిఫ్ట్ లో ఒక్కదాన్నే వెళ్తున్నప్పుడు కరెంటు పోయింది . . .
ఒక క్షణం ప్రాణం పోయినంత పని అయింది . . . పర్వాలేదు కరెంటు వస్తుంది . . . జనరేటర్ వేస్తారు అని నా మనసుకి నచ్చచేప్పుకున్నప్పటికి . . . జనరేటర్ ఆన్ అయ్యి లిఫ్ట్ స్టార్ట్ అయ్యే లోపు బుర్ర రక రకాలుగా ఆలోచించింది . . . అది కూడా క్లోస్డ్ లిఫ్ట్ కావడంతో ఎక్కువ సేపు కరెంటు రాకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. . .
చ ఇప్పటివరకు బతికి ఇలా లిఫ్ట్ లో ఊపిరి పొతే ఏమిబాగుంటుంది . . . అని ఒక వైపు . . .
క్లోస్డ్ లిఫ్ట్ లు కి బదులు గ అన్ని లిఫ్ట్ లు ఓపెన్ గ ఐరన్ జాలీలతో ఉంటే ఎంత బాగుండు అనిపించింది . . .
అసలు ఆక్సిజన్ ఎంతసేపు ఉంటుంది . . .?
ఈ ఆలోచనలు ఒకవైపు బుర్రని తినేస్తుంటే . . . . చూపు లిఫ్ట్ పైకి వెళ్ళింది . . . పైన ఫ్యాన్ కోసం పెట్టిన గ్యాప్ తప్ప ఎక్కడ ఖాలీ కనిపించలేదు . . ..
దాంతో ఇక ఒళ్ళంతా చెమటలు పట్టిన ఫీలింగ్ వచ్చింది . . . అప్పుడే హన్డ్బాగ్ చేతికి తగిలింది . . . బాగ్ లో ఉన్నా మొబైల్ చేతిలోకి తీసుకుని కొలీగ్ ప్లస్ ఫ్రెండ్ స్వాతి కి ఫోన్ చేసి పరిస్తితి చెప్దాం అనుకున్నాను . . .
ఇంతలొ పవర్ వచ్చింది . . . కాని లిఫ్ట్ కదలలేదు . . . ఫ్లోర్ బటన్స్ అన్నీ బ్లాంక్ గానే ఉన్నాయి దాంతో ఇదేంటి పవర్ వచ్చిన తరువాత కూడా లిఫ్ట్ కదలడం లేదు అని . . . . ఇంకా టెన్షన్ ఎక్కువైంది . . . .
ఇక స్వాతి కి ఫోన్ చేద్దాం అనుకుంటుంటే లిఫ్ట్ కి ప్రాణం వచ్చింది . . . దానితో పాటు నాకు కూడా. . . .
బాబోయి లిఫ్ట్ ఆగింది బహుశా ఒక్క నిముషం కూడా పూర్తిగా అయి ఉండదు కాని . . . ఆ అరవై సెకండ్స్ లోనే ఇంట గందరగోళం జరిగింది . . .
3 comments:
ammaa...where r u now ?(which channal)
నిజమే.ఆలోచనలకన్నా భయంకరం గా భయపెట్టేవి వుండవేమో లోకంలో
లిఫ్ట్ ఆగిపోగానే
1. ఆ లిఫ్ట్ కి పవర్ బాక్ అప్ సౌకర్యం ఉందా?
2.అలారం ఉందా?
3.ఎమర్జెన్సీ లైట్ ఉందా?
4. మన చేతిలో ఫోన్ ఉందా?
5. లేక లిఫ్ట్ లో ఫోన్ ఉందా?
ఇవేవీ గుర్తుకు రావు! ముందు గుండె ఆగినంత పని మాత్రం అవుతుంది. ఇది common human tendency అనుకుంటాను.
Post a Comment