Friday, June 25, 2010

నిశ్శబ్దం

నిశ్శబ్దం.
పలకడానికి గంభీరంగా ఉంటుంది. కానీ, ఇది చాలా మందికి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
ఎన్నో ఆలోచనలను ఇస్తుంది.
నూతన ఆవిష్కారాలకు మూలం అవుతుంది.
అంతేకాదు కొన్నిసార్లు మనసుకి విపరీతమైన వంటరితనాన్ని కూడా ఇస్తుంది నిశ్శబ్దం.
కొన్ని భయంకర ఆలోచనలకు పునాది కూడా వేస్తుంది.
నిశ్శబ్దం.
ఇది నిశ్శబ్దం.

Thursday, June 24, 2010

శూన్యం

శూన్యం అంటే ఏమిటి?
ఎప్పుడు వస్తుంది?
ఎంత బాగుంటుంది?
నిజంగా అందులో ఆనందం ఉంటుందా?
ఎటువంటి అనుభూతిని అందిస్తుంది శూన్యం?
ఏమిటి ఈ శూన్యం?
ఎక్కడ ఉంది?
ఎంత బాగుంటుంది?

Monday, June 14, 2010

మనది కానప్పుడు

కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండానే కొన్ని పనులు జరిగిపోతుంటాయి.
వాటి వల్ల మనకు ఇబ్బంది లేకపోతె పర్వాలేదు. కానీ, మన తప్పు లిఎకుండానే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనసుకి ఎంత బాధ కలుగుతుంది?
ఎవరో చేసిన పొరపాటుకి వేరొకరిని భాద్యులని చేస్తూ తిట్టే వాళ్ళని చూస్తే జాలేస్తుంది.
వాళ్ళ అజ్ఞానికి, పొరపాటు చేసిన వాళ్ళని ఏమీ అనలేని వాళ్ళ చేతకాని తనానికి జాలేస్తుంది.
ఇలాంటి వాళ్ళను ముఖ్యంగా మేనేజ్ మెంట్ పొజిషన్ లో ఉన్నందుకు జాలి పడటం తప్ప ఏమీ చేయగలం?
పాపం బుర్ర తక్కువ మనుషులు అనుకోవడం తప్ప.

Sunday, June 13, 2010

అందానికి నిర్వచనం

అందానికి నిర్వచనం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు.
నా దృష్టిలో అందం అంటే. . ఒక వస్తువును, ఒక మనిషిని, ప్రకృతిని . . . ఇలా దేన్నైనా చూడగానే అప్పటికప్పుడు మనసుకి అందంగా, ఆహ్లాదంగా అనిపించడమే అందం. అంతేకాని ఫలానాదే అందం. అందం అంతే ఇదీ అంటూ చెప్పడం శుద్దదండగ అనిపిస్తుంది నాకు.

Tuesday, June 1, 2010

చానల్స్ బాన్ చేస్తే బాగుండు

సారీ సారీ చానల్స్ కాదు చానల్స్ లో ప్రసారమయ్యే కొన్ని ప్రసారాలను నియంత్రిస్తే బాగుండు అనిపిస్తుంది. చానల్స్ ను బాన్ చేస్తే వాటినే నమ్ముకుని బతికే ఎంతో మందికి ఇబ్బంది అవుతుంది.
ఒక ఇష్యూ ని ఇష్యూ గా కాకుండా ఎందుకు పర్సనల్ గా వెళ్తారో ఆ దేవుడికే తెలియాలి (unte)
అసలు మీడియా వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఒక లక్షమణ రేఖ పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది.
లేకపోతె వీళ్ళని ఆపతరం కావడంలేదు.
విషయం ఒకటి జరిగింది అన్నప్పుడు. విషయపరంగానే వెళ్తే . . . అందులో అతిశయోక్తులు లేకుండా చూపించ గలిగితే వాళ్ళ డ్యూటీ ని వాళ్ళు చేస్తే సరిపోతుంది. న్యూస్ ని న్యూస్ లాగా చెప్పగలిగితే బాగుంటుంది.
మీడియా పిచ్చి గా తయారవుతోంది. . . ఈ మధ్య.

Monday, May 31, 2010

ఇంటర్మీడియట్ రిజల్ట్ లో

ఇంటర్మీడియట్ రిజల్ట్ లో వెలుగు చూస్తున్న దారుణమైన నిజాలను చూస్తుంటే. కడుపు తరుక్కు పోతుంది.

మేము టెన్త్ చదివే రోజుల్లో. మా స్కూల్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి బాగా చదివేవారు. చిన్న స్లిప్ టెస్ట్ పెట్టిన కూడా. వాల్లిద్దరిదే పోటి అన్నట్టు గా ఉండేది. అంత బాగా చదివే ఆ ఇద్దరు టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు.
ఇద్దరు తలకో సబ్జెక్టు పోగొట్టుకున్నారు. ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్య పోవడం మా వంతయింది ఎందుకంటే ఇద్దరూ మంచి క్లవర్ స్టూడెంట్స్. ఇక నా విషయానికి వస్తే మరీ అంత అత్తెసరుగా కాదు కానీ పర్వాలేదు బాగానే చదివేదాన్ని. అలాంటిది నాకు కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అప్పుడు రివాల్యుయే షన్ పెట్టిదామనుకున్నాము కానీ అప్పట్లో ఎందుకో కుదరలేదు.
ఇవ్వాళ న్యూస్ వింటే అప్పట్లో కూడా ప్రైవేటు స్కూల్స్ రిజల్ట్ బాగా రావడం కోసం . ఇలాంటి గోల్ మాల్ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది.
లేకపోతె సున్నా మార్కులు వచ్చిన పేపర్ కి డెబ్భైఐదు మార్కులు రావడమేంటి?
అంటా డబ్బు మాయం. డబ్బులు బాగుంటే మంచి కార్పొరేట్ కళాశాలలో చేరొచ్చు. మస్తు మస్తు గా మార్కులు తెచ్చుకోవచ్చు.
ఇలాంటి పద్ధతుల వల్లే డబ్బు ఉన్నవాళ్లకే మంచి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి.
అసలు పరీక్షలు వద్దు, పిచ్చి చదువులూ వద్దు అనిపిస్తోంది. చిరాకు పుడుతోంది.

Friday, May 28, 2010

సురేఖ కి నిద్ర మాత్రలు ఎక్కడివి?

సురేఖ గారు మీ డ్రామా గ్రాండ్ సక్సెస్ అయ్యింది . మీకు అంత గొడవలో నిద్ర మాత్రలు ఎక్కడి నుండి వచ్చాయి?
అంటే ముందు గానే ప్లాన్ చేసి పెట్టుకున్నారా?
మీకు ముందే ఇంత గొడవ జరుగుతుందని తెలుసన్నమాట. అందుకే డ్రామా ని రక్తి కట్టించడానికి బాగా ప్రిపరే అయ్యి వచ్చారు.
వెరీ గుడ్.
ఒక ప్రజా నేత అయ్యి ఉండి అన్ని బూతులు ఓపెన్ గా ఎందుకు తల్లీ తిట్టావు.
ఛీ. . .

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం