Thursday, October 21, 2010

రాగి తందిరా. . .

రాగి తందిరా. . .
రాగి తందిరా. . .
రాగి తందిరా. . .
బీక్షకే రాగి తందిరా . . .

భోగ్య రాగి యోగ్య రాగి భాగ్యవంత రాగి . . .. నీవు రాగి తందిరా. . .
భీక్షకే రాగి తందిరా. . .

అన్నదానవ మాడువ రాగి
అన్న చాత్రవ నీ తవ రాగి

అన్యవాంతి అభీటవ రాగి
అనుదిన భజనే అమాడువ రాగి. . . . రాగి తందిరా. . .

గురుగల సేవియ మాడువ రాగి
గురుతికి బాహా రంజివ రాగి

కరి కరి సంసార నీటావా రాగి . . .
పురందర విటల నసేవిప రాగి . . . రాగి తందిరా. . .
భోగ్య రాగి యోగ్య రాగి భాగ్యవంత రాగి . . .. నీవు రాగి తందిరా. . .


బొంబాయి జయశ్రీ గొంతులో కీర్తన వింటుంటే హాయిగా ఉంటుంది. . .
వంద శాతం గ్యారెంటీ

Wednesday, October 13, 2010

పెన్ను, పేపర్. . . కీ బోర్డు, కంప్యూటర్ స్క్రీన్ ఇవి చాలా?

నిజమే మరి. . .
ఏ విషయాన్నీ అయినా పేపర్ మీద పెట్టాలంటే. . . పెన్ను, పేపర్ ఉంటె సరిపోతుందా?
అలాగే కాస్త అడ్వాన్సు అయ్యి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని. . . కీ బోర్డు పైన వెళ్ళు ఆడిస్తే సరిపోతుందా?
లేదు. . . కాదు. . .
బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వాలంటే కచ్చితంగా బుర్ర ప్రశాంతం గా ఉండాలి. అప్పుడే మనసు కూడా ప్రశాంతం గా ఉంటుంది.
ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడం కుదురుతుంది.
అలా సహకరించని సమయంలో ఆలోచనలకు అక్షర రూపం ససేమీరా కుదరదు.
అందుకే ఆలోచనలకి ఇచ్చే అక్షర రూపానికి. . .
పీస్ అవసరం. . . అవసరం. . .

Monday, August 23, 2010

ఏమిటిది?

ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.. . .

Friday, August 20, 2010

మనిషికో స్నేహం. . .

మనిషికో స్నేహం. . .
మనసుకో దాహం. . .
లేనిదే జీవం లేదు. . .
జీవితం కానే కాదు. . .
మమతనే మధువు లేనిదే చేదు. . .
మనిషికో స్నేహం. . . మనసుకో దాహం. . .

Tuesday, July 27, 2010

పైశాచికత్వం

ప్రపంచీకరణ నేపద్యంలో పైశాచికత్వం పెచ్చరిల్లి పోయింది.

Thursday, July 15, 2010

మన తెలుగుని కాపాడుకుందాం


సోదర సోదరీమణులారా...!

మన తెలుగును మనం కాపాడుకుందాం.

ప్రపంచంలోనే ఎక్కడా లేని

విధంగా మన తెలుగు భాష

అచ్చుతప్పులతో లిఖించబడుతూ

అల్లల్లాడిపోతోంది.

విషయం బోర్డునడిగినా...

గోడమీది రాతలనడిగినా

చెబుతాయి.

ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని

హైదరాబాదులో

కమర్షియల్

సైన్ బోర్డునైనా చూడండీ...

తప్పులు తండోపతండాలుగా

దొర్లుతుంటాయి.

ఇక టీవీల్లో స్క్ర్రోలింగు వగైరాల్లో కూడా

తప్పు దొర్లందే వార్తలు పూర్తికావడం లేదు.

మన తెలుగును కాపాడుకోవడంలో

భాషా సంఘం నిస్సిగ్గుగా నిద్దురపోతోందనడానికి

ఇంతకన్నా ఉదాహరణలు లేవు.

ఏదో ఒక ఉద్యమం చేపట్టి...

'సేవ్ తిరుమల' లాగా...

'మన తెలుగును కాపాడుకుందాం' అనే

నినాదంతో

ఏదైనా చానెల్ ముందుకు వెళితే...

తెలుగు భాషకు చానెల్ ఎంతో

మేలు చేసినట్టు అవుతుంది.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం